Share News

Union Minister Kishan Reddy: మైనార్టీల ఓట్ల కోసం రక్షణ శాఖ భూముల ఆక్రమణ

ABN , Publish Date - Oct 09 , 2025 | 05:17 AM

త్వరలో జూబ్లీహిల్స్‌లో జరగనున్న ఉప ఎన్నికల్లో మైనార్టీల ఓట్ల కోసం.. రక్షణ శాఖకు చెందిన భూముల్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ముస్లింలకు...

Union Minister Kishan Reddy: మైనార్టీల ఓట్ల కోసం రక్షణ శాఖ భూముల ఆక్రమణ

న్యూఢిల్లీ, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): త్వరలో జూబ్లీహిల్స్‌లో జరగనున్న ఉప ఎన్నికల్లో మైనార్టీల ఓట్ల కోసం.. రక్షణ శాఖకు చెందిన భూముల్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ముస్లింలకు అప్పగించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌ షేక్‌పేట్‌లోని 2,500 గజాల భూమిని ముస్లిం శ్మశాన వాటిక కోసం కేటాయించిందని, ఈ తతంగాన్ని రాష్ట్ర ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు దగ్గరుండి నడిపించారని బుధవారం ఎక్స్‌ వేదికగా ఆయన తెలిపారు. మైనార్టీలను బుజ్జగించడం, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం కాంగ్రెస్‌ డీఎన్‌ఏలో అంతర్భాగమని ఎద్దేవా చేశారు. సాయుధ దళాల పట్ల ప్రభుత్వానికి ఉన్న అగౌరవం ఈ ఘటనతో మరింతగా అర్థమవుతోందని కిషన్‌రెడ్డి అన్నారు.

Updated Date - Oct 09 , 2025 | 05:17 AM