Mallu Ravi Counters Bandi Sanjay: మనుషులను చంపితే నక్సలిజం పోదు
ABN , Publish Date - Sep 03 , 2025 | 05:04 AM
మనుషులను చంపితే నక్సలిజం పోదన్న సంగతి కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రహించాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు...
ఇది బండి సంజయ్ గ్రహించాలి: మల్లు రవి
హైదరాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి):మనుషులను చంపితే నక్సలిజం పోదన్న సంగతి కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రహించాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి పౌరునికీ అభివృద్ధి ఫలాలు అందాలన్న ఫిలాసఫీని నక్సలైట్లు పెట్టుకున్నారని తెలిపారు. అయితే తుపాకీ ద్వారా దాన్ని సాధించాలనే వారి విధానానికి సీఎం రేవంత్‌రెడ్డి వ్యతిరేకమన్నారు. నక్సలైట్లకూ ఓ ఫిలాసఫీ ఉందనే రేవంత్ చెప్పారని, అందుకే వారితో మాజీ సీఎం వైఎ్‌సఆర్ చర్చలు జరిపారని గుర్తు చేశారు. ఛత్తీ్‌సగఢ్‌లో సల్వాజుడుం పేరుతో వారిలో వారు చంపుకొనే వ్యవస్థనే జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వ్యతిరేకించారన్నారు.