Share News

Kharif Crop: 99 శాతం వానాకాలం పంటల సాగు!

ABN , Publish Date - Sep 11 , 2025 | 04:24 AM

వానాకాలం పంటల సాగు ముగింపు దశకు చేరుకుంది. సాధారణ సాగు విస్తీర్ణంలో సుమారు 99 శాతం పంటల సాగు పూర్తయినట్లు..

Kharif Crop: 99 శాతం వానాకాలం పంటల సాగు!

హైదరాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): వానాకాలం పంటల సాగు ముగింపు దశకు చేరుకుంది. సాధారణ సాగు విస్తీర్ణంలో సుమారు 99 శాతం పంటల సాగు పూర్తయినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ బుధవారం ఓ నివేదికలో వెల్లడించింది. మొత్తం సాధారణ సాగు విస్తీర్ణం 1,32,44,305 ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 1,30,94,934 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసినట్లు పేర్కొంది. ఇందులో ప్రధాన పంట వరి సాధారణ విస్తీర్ణం 62,47,868 ఎకరాలు కాగా... 65,52,000 ఎకరాల్లో రైతులు సాగుచేశారు. పత్తి సాధారణ విస్తీర్ణం 48,93,016 ఎకరాలు కాగా... 45,76,992 ఎకరాల్లో (93.54 శాతం విస్తీర్ణంలో) రైతులు పత్తి సాగుచేశారు.

Updated Date - Sep 11 , 2025 | 04:24 AM