MLA Dhanam Nagender: ఆ వార్తలన్నీ ఊహాగానాలే
ABN , Publish Date - Sep 12 , 2025 | 04:59 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాను పోటీ చేస్తున్నానంటూ వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని ఖైరతాబాద్...
జూబ్లీహిల్స్‌లో నేను పోటీ చేయట్లేదు
ఎవరికి టికెటిచ్చినా గెలుపే లక్ష్యంగా పని చేస్తా
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
బంజారాహిల్స్, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాను పోటీ చేస్తున్నానంటూ వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో పోటీ విషయమై తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. అనంతరం దానం మాట్లాడుతూ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని, అందులో ఎవరి ప్రమేయమూ ఉండదని అన్నారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా.. వారి గెలుపే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రె్‌సకు జూబ్లీహిల్స్ గెలవడం చాలా అవసరమని, ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డుతానని చెప్పారు. ఫిరాయింపులపై ప్రశ్నించగా... అది కోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతం మాట్లాడబోనని స్పష్టం చేశారు.