Share News

కేజీబీవీ సమ్మర్‌క్యాంప్‌ విజయవంతం చేయాలి

ABN , Publish Date - Apr 30 , 2025 | 11:22 PM

కేజీబీవీ సమ్మర్‌ క్యాంప్‌ను విజయవంతం చేయాలని డీఈవో యాదయ్య అన్నారు. బుధవారం ఆయన సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 3 నుంచి కేజీబీవీ విద్యార్థు లకు జరిగే సమ్మర్‌ క్యాంప్‌ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

కేజీబీవీ సమ్మర్‌క్యాంప్‌ విజయవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో యాదయ్య

డీఈవో యాదయ్య

మంచిర్యాలక్రైం, ఏప్రిల్‌30(ఆంధ్రజ్యోతి): కేజీబీవీ సమ్మర్‌ క్యాంప్‌ను విజయవంతం చేయాలని డీఈవో యాదయ్య అన్నారు. బుధవారం ఆయన సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 3 నుంచి కేజీబీవీ విద్యార్థు లకు జరిగే సమ్మర్‌ క్యాంప్‌ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. సమ్మర్‌క్యాంప్‌ను కస్తూర్భా బాలికల విద్యాలయం నస్పూర్‌లో నిర్వహిస్తామన్నారు. ప్రతి కేజీబీవీ నుంచి విద్యార్థులను క్యాంప్‌కు పంపాలని స మ్మర్‌ క్యాంప్‌తో విద్యార్థులకు పెయింటింగ్‌, డ్యాన్స్‌, స్పోకెన్‌ ఇంగ్లీషు, స్పీడ్‌ మ్యాథమెటిక్స్‌, కంప్యూటర్‌లో మెళకువలు, ఆటలు, యోగలలో ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. డీఈవోతో పాటు సెక్టోరియల్‌ అధికారులు యశోధర, చౌదరి సత్యనారాయణమూర్తి, స్పెషల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 11:22 PM