Share News

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రివ్యూ కమిటీ పెద్దల విచారణ

ABN , Publish Date - Dec 23 , 2025 | 03:51 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాడు ట్యాపింగ్‌ రివ్యూ కమిటీలో ఉన్న పెద్దలను సిట్‌ అధికారులు మళ్లీ విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసారు.

 Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రివ్యూ కమిటీ పెద్దల విచారణ

  • సోమేశ్‌, శాంతి కుమారి, నవీన్‌ చంద్‌, రఘునందన్‌ల వాంగ్మూలాలు నమోదు

  • ప్రభాకర్‌ రావును ఎస్‌ఐబీలో నియమించడం వెనుక ఉన్న కారణాలపై సిట్‌ ఆరా

హైదరాబాద్‌, డిసెంబర్‌ 22(ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాడు ట్యాపింగ్‌ రివ్యూ కమిటీలో ఉన్న పెద్దలను సిట్‌ అధికారులు మళ్లీ విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసారు. ప్రభాకర్‌ రావు ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిన సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న మాజీ జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీ రఘనందన్‌, మాజీ సీఎ్‌సలు సోమేశ్‌ కుమార్‌, శాంతికుమారి, మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ నవీన్‌ చంద్‌ ఆదేశాలు ఇచ్చారు. అయితే, వీరి ఆదేశాలు లేకుండా కూడా చాలా మంది రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్‌ జరిగినట్లు సిట్‌ అభిప్రాయపడుతోంది. ఇది రివ్యూ కమిటీలో ఉన్న అధికారులకు తెలుసా.. లేదా.. అనే అంశాలపై సిట్‌ ఆరా తీసింది. వీరిని సాక్షులుగా విచారించి ేస్టట్మెంట్లను రికార్డు చేసింది. అవసరం అనుకుంటే మరోసారి కూడా అధికారుల వాంగ్మూలాలను సిట్‌ నమోదు చేయనుంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌ రావును ప్రస్తుతం సిట్‌ రెండో దఫా కస్టోడియల్‌ విచారణ జరుపుతోంది. ఉన్నతాధికారులు చెప్తేనే తాను ఫోన్లు ట్యాప్‌ చేయించానని గతంలో పోలీసులకు ప్రభాకర్‌ రావు స్టేట్మెంట్‌ ఇచ్చిన సంగతి విదితమే. ఇక ఈ కేసులో గతంలో జైలుకి వెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చిన నిందితులను కలిపి ప్రభాకర్‌ రావును ఈ రెండు మూడు రోజుల్లో విచారణ జరిపే అవకాశం ఉంది. ఫోన్‌ ట్యాపింగ్‌పై దర్యాప్తు కోసం ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ హయాంలో పని చేసిన అధికారులను మరోసారి విచారించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌గా ప్రభాకర్‌రావు రిటైర్మెంట్‌ తర్వాత ప్రభాకర్‌ రావును ఎస్‌ఐబీలో నియమించడం వెనుక ఉన్న కారణాలను, ఆ ప్రక్రియలో ఐఏఎస్‌ అధికారుల పాత్రను సిట్‌ అధికారులు ఆరా తీశారు. ఆయన సూచించిన ఫోన్‌ నంబర్లను ఎలాంటి పరిశీలన లేకుండా హోం శాఖకు పంపడంపె,ౖ ఇందుకోసం వారిపై ఎవరైనా ఒత్తిడి చేశారా అన్నదానిపై మాజీ ఐపీఎస్‌ అధికారుల నుంచి వివరాలు ేసకరించారు. మూడో రోజుల్లో ప్రభాకర్‌రావు సిట్‌ కస్టడీ ముగుస్తుంది. ఆ తర్వాత, విచారణలో వెల్లడైన అంశాలతో సిట్‌ ఈ కేసులో అనుబంధ చార్జిషీటును సుప్రీంకోర్టులో దాఖలు చేయనుంది.

Updated Date - Dec 23 , 2025 | 03:51 AM