Share News

Irrigation Department: ఈఎన్‌సీగా మహ్మద్‌ అంజద్‌

ABN , Publish Date - Aug 21 , 2025 | 04:28 AM

తెలంగాణ నీటిపారుదల శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు చీఫ్‌ ఇంజనీర్‌ (ఎంక్వయిరీ్‌స)గా పనిచేస్తున్న మహ్మద్‌ అంజద్‌ హుస్సేన్‌ను

Irrigation Department: ఈఎన్‌సీగా మహ్మద్‌ అంజద్‌

  • నీటిపారుదల శాఖలో మార్పులు

హైదరాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నీటిపారుదల శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు చీఫ్‌ ఇంజనీర్‌ (ఎంక్వయిరీ్‌స)గా పనిచేస్తున్న మహ్మద్‌ అంజద్‌ హుస్సేన్‌ను ఈఎన్‌సీ (జనరల్‌)గా పూర్తిస్థాయిలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, ఇటీవల సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు (ఎస్‌ఈ)గా పదోన్నతి పొందిన 43 మంది ఈఈల స్థానంలో ఇతర అధికారులకు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగిస్తూ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా మరో జీవో జారీ చేశారు. కాగా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల (డీఈఈ)కు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లుగా పదోన్నతులు కల్పించడానికి ఈనెల 23న జరగాల్సిన డీపీసీ సమావేశం వాయిదా పడే అవకాశాలున్నాయని సమాచారం.

Updated Date - Aug 21 , 2025 | 04:28 AM