Keeravani: గ్లోబల్ సమ్మిట్‌లో కీరవాణి కచేరి
ABN , Publish Date - Dec 05 , 2025 | 02:43 AM
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనే దేశ, విదేశీ ప్రతినిధులను తెలంగాణ సాంస్కృతిక కళారూపాలు అలరించనున్నాయి. ఆస్కార్ అవార్డు....
90 నిమిషాల పాటు ప్రత్యేక సంగీత కార్యక్రమం
జయలక్ష్మి వీణా కార్యక్రమం, కళాకృష్ణ పేరిణి ప్రదర్శన
10-13 తేదీల్లో రోజంతా మ్యూజికల్ ఆర్కెస్ర్టా
హైదరాబాద్, డిసెంబరు 4 (ఆంధ్ర జ్యోతి): తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనే దేశ, విదేశీ ప్రతినిధులను తెలంగాణ సాంస్కృతిక కళారూపాలు అలరించనున్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తన బృందంతో 90 నిమిషాల సంగీత కచేరీ అలరించనుంది. ప్రముఖ వీణా విద్యాంసురాలు పి.జయలక్ష్మి వీణా కార్యక్రమం, కళా కృష్ణ ఆధ్వర్యంలో పేరిణి నాట్యం అతిథులను ఆకట్టుకోనున్నాయి. ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు సామల వేణు ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. వీటితోపాటు తెలంగాణ సంప్రదాయ కళారూపాలు ఆహుతులను అలరించనున్నాయి. కొమ్ముకోయ, బంజారా, కోలాటం, గుస్సాడి, ఒగ్గుడోలు, మహిళల డప్పులు, పేరణి నృత్యం, బోనాల కోలాటం వంటి ప్రజా కళారూపాలతో అతిఽథులకు ఆహ్వానం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సమ్మిట్ డిసెంబరు 8 నుంచి ప్రారంభమవుతుండగా 10 నుంచి 13వ తేదీ వరకు ఈ వేడుకలను ప్రజలు కూడా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ నాలుగు రోజుల పాటు రోజంతా మ్యూజికల్ ఆర్కెస్ర్టా నిర్వహిస్తారు.