సైబర్ నేరగాళ్లను దూరం పెట్టండి
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:21 PM
సైబర్ నేరగాళ్లను దూరం పెట్టాలని, సైబర్ మోసాలకు చెక్ పెట్టే దిశగా తెలంగాణ పోలీసులు నూతన ఆవిష్కరణ చేస్తుందని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ‘మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. ఆలోచించండి, చెక్ చేసుకోండి’.. సు రక్షితంగా ఉండాలని ఆయన అన్నారు.
‘ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్’ కార్యక్రమం విజయవంతం చేయాలి
రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాల క్రైం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి) : సైబర్ నేరగాళ్లను దూరం పెట్టాలని, సైబర్ మోసాలకు చెక్ పెట్టే దిశగా తెలంగాణ పోలీసులు నూతన ఆవిష్కరణ చేస్తుందని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ‘మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. ఆలోచించండి, చెక్ చేసుకోండి’.. సు రక్షితంగా ఉండాలని ఆయన అన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తత కోసం ప్ర త్యేక కార్యాచరణలో రామగుండం పోలీసు కమిషనరేట్‌లో ఆయన మాట్లాడు తూ సైబర్ నేరగాళ్లను దూరం పెట్టండి, ఫ్రాడ్‌కు పుల్‌స్టాప్ పెట్టండి అంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్ర జలలో అవగాహన పెంపుదల లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యురిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా పుల్‌స్టాప్ పేరుతో ఆరు వారాలు రాష్ట్ర వ్యాప్త సైబర్ భద్రత ప్రచార కార్యక్రమంలో భాగంగా డీజీపీ, టీజీసీఎస్‌డీ చికాగోయల్, సీనియర్ అధికారులు, విద్యార్థులు, ఇతర ప్రముఖులు ప్రారం భించారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలో జామ్ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో పాల్గొన్నామన్నారు. సైబర్ నేరాలపై విద్యార్ధులకు అ వగాహన కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ వర్క్‌షాపు నిర్వహించామన్నారు. ఆన్ లైన్ ప్రతిజ్ఞ తీసుకోవడం, సంబంధిత కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ చేశామ న్నారు. ఈ కార్యక్రమం సత్ఫలితమిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, సీసీఎస్ ఏసీపీ రంగారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఉన్నారు.