Share News

పదేళ్లలో ప్రజలకు కేసీఆర్‌ చేసింది శూన్యం

ABN , Publish Date - Dec 25 , 2025 | 11:34 PM

మాజీ సీఎం కేసీ ఆర్‌ పదేళ్ల పాలనలో పదవి ఎంజాయ్‌ చేశారే తప్ప ప్రజలకు చేసింది శూన్యమని రాష్ట్ర కార్మిక ఉపాధికల్పన గనులశాఖ మంత్రి డాక్టర్‌ వివేక్‌ వెంకటస్వామి తెలిపారు.

పదేళ్లలో ప్రజలకు కేసీఆర్‌ చేసింది శూన్యం
మంత్రి వివేక్‌ వెంకటస్వామిని సన్మానిస్తున్న కాలనీవాసులు

మరో పదేళ్లు కాంగ్రెస్‌ పాలనే ఉంటుంది

మంత్రి వివేక్‌ వెంకటస్వామి

మందమర్రిటౌన్‌, డిసెంబరు25 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీ ఆర్‌ పదేళ్ల పాలనలో పదవి ఎంజాయ్‌ చేశారే తప్ప ప్రజలకు చేసింది శూన్యమని రాష్ట్ర కార్మిక ఉపాధికల్పన గనులశాఖ మంత్రి డాక్టర్‌ వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. గురువారం మందమర్రిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. మొదటి నుంచి తాను బీఆర్‌ఎస్‌ కుంభకోణాలపై ప్రశ్నించానని వారి పాలనలో తనను ఎం తో ఇబ్బంది పెట్టాలని కొన్ని పరిశ్రమలపై కూడా మూసి వేయించేం దుకు కుట్రలు చేశారని అయినా భయపడలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణాలపై కూడ పదే పదే ప్రశ్నించానని తాను చెప్పిం దే నిజమైందన్నారు. కుంభకోణాలతో కోట్లు కూడబెట్టుకున్నారని ఆ కోట్ల కోసమే కేసీఆర్‌ కుటుంబంలో కొట్లాటలు ప్రారంభమయ్యా య న్నారు. ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకున్న మాత్రాన కేసీఆర్‌ను మళ్లీ ప్రజలు ఆద రిస్తారనుకుంటే పొరపాటేనని రాష్ట్రంలో మరో పదేళ్లకు పైగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు. ఇప్పుడు నీటి వనరుల గురించి కేటీఆర్‌ మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ముందు ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ఆరోపణలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మె ల్యేలు, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎమ్మెల్యే హరీశ్‌రావులు జవాబు చెబితే బాగుంటుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అద్యక్షులు రఘునాథ్‌ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఉపేందర్‌గౌడ్‌్‌లు తదితరులు పాల్గొన్నారు.

ఫపట్టణంలోని మార్కెట్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ సంఘానికి సం బంధించిన ఆరు గుంటల ఖాళీ స్థలంలో అంబేద్కర్‌ కమ్యూనిటీ హా ల్‌కు నిధులు మంజూరు చేయాలని, అంబేద్కర్‌ క్యాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రి డాక్టర్‌. జి. వివేక్‌ వెంకటస్వామి అంబేద్కర్‌ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈసంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్‌ కమ్యూనిటిహాల్‌కు రూ.50 లక్షలు, కాంస్య విగ్రహం ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో అంబేద్కర్‌ పట్టణ అధ్యక్షుడు మొయ్య రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2025 | 11:34 PM