Former CM KCR gave the B Form: మాగంటి సునీతకు బీ ఫాం
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:03 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేది బీఆర్‌ఎస్సేనని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజల్లో బీఆర్‌ఎ్‌సకు ఆదరణ ఉందన్నారు...
ఎన్నికల ఖర్చులకు రూ.40 లక్షల చెక్కు అందజేసిన కేసీఆర్
గజ్వేల్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేది బీఆర్‌ఎస్సేనని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజల్లో బీఆర్‌ఎ్‌సకు ఆదరణ ఉందన్నారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీతకు మంగళవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన ఫాంహౌ్‌సలో కేసీఆర్ బీ ఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చుల కోసం రూ.40 లక్షల చెక్కును ఇచ్చారు. ఈ సందర్బంగా మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పద్మారావుగౌడ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావుతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రచారం నిర్వహిస్తున్న తీరుతెన్నులు, చేపట్టవలసిన కార్యక్రమాలపై సూచనలు చేయడంతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.