Share News

KCR Extends Dasara Greetings: రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ దసరా శుభాకాంక్షలు

ABN , Publish Date - Oct 02 , 2025 | 05:32 AM

రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం ఒక ప్రకటనలో...

KCR Extends Dasara Greetings: రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ దసరా శుభాకాంక్షలు

హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం ఒక ప్రకటనలో దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యదక్షులను అపజయాల నుంచి విజయాల దిశగా నడిపిస్తూ, ధర్మానిదే విజయమనే స్ఫూర్తిని దసరా పండుగ మనకు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తాము ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోవాలని, వారి జీవితాల్లో సుఖసంతోషాలు నిండేలా దీవించాలని దుర్గామాతను కేసీఆర్‌ ప్రార్థించారు.

Updated Date - Oct 02 , 2025 | 05:32 AM