MLC Kalvakuntla Kavitha: బీసీ బిల్లు తేవడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కార్‌పై పోరాటం
ABN , Publish Date - Oct 11 , 2025 | 03:05 AM
ఎన్నికలప్పుడు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి.. బీసీ బిల్లు సాధించి తీసుకురావడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కార్‌పై పోరాటం...
హైదరాబాద్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలప్పుడు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి.. బీసీ బిల్లు సాధించి తీసుకురావడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కార్‌పై పోరాటం చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఎల్‌బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్‌కు చెందిన బీసీ నాయకుడు రామ్‌కోటి, ఆయన అనుచరులు కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జాగృతిలో చేరినవారు పోరాటం చేయాల్సి ఉంటుందని, జాగృతి అంటేనే విప్లవం, పోరాటాల జెండా అని అన్నారు.