Kalvakuntla Kavitha: సామాజిక తెలంగాణే ధ్యేయం
ABN , Publish Date - Sep 10 , 2025 | 04:33 AM
సామాజిక తెలంగాణ సాధనే తమ ధ్యేయమని, ఈ ప్రక్రియలో కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తినే ఆదర్శంగా తీసుకుంటామని కల్వకుంట్ల కవిత అన్నారు..
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): సామాజిక తెలంగాణ సాధనే తమ ధ్యేయమని, ఈ ప్రక్రియలో కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తినే ఆదర్శంగా తీసుకుంటామని కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ కోసం ఎంతటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొంటామన్నారు. కాళేశ్వరం కూలిందన్న సీఎం ఆ ప్రాజెక్టులో భాగమైన.. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తెచ్చే ప్రాజెక్టుకు శంకుస్థాపన ఎలా చేశారని ప్రశ్నించారు.