Kaleshwaram corruption: కాళేశ్వరం అవినీతికి కవితే మొదటి సాక్షి
ABN , Publish Date - Sep 03 , 2025 | 04:52 AM
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగింది అనడానికి మొదటి సాక్షి కవితేనని భువనగిరి ఎమ్మెల్యే..
ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డి
సీబీఐ అంటే కేసీఆర్‌కు భయమెందుకు?: ఎమ్మెల్యే వీరేశం
హైదరాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగింది అనడానికి మొదటి సాక్షి కవితేనని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. సీపీఐ విచారణ ప్రారంభం కాకుండానే హరీశ్‌రావు, సంతో్‌షరావు అవినీతి చేశారంటూ తేల్చి చెప్పారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ డైరెక్షన్‌లోనే వారు పని చేశారు కాబట్టి, అవినీతీ కూడా ఆయన డైరెక్షన్‌లోనే జరిగిందని స్పష్టమవుతోందన్నారు. సీఎల్పీ మీడియా హాల్లో మంగళవారం మీడియా సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును ఇతర దేశాల్లో కడితే చర్యలు అత్యంత తీవ్రంగా ఉండేవన్నారు. వేముల వీరేశం మాట్లాడుతూ, అపర మేధావి అయిన కేసీఆర్.. సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఆయన అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేసినప్పుడే అవినీతికి పాల్పడినట్లు స్పష్టమైందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి రూ. వెయ్యి కోట్ల డిపాజిట్లు.. రూ. వేల కోట్ల అవినీతి సొమ్ము ఉందని, వాటి పంపకాల్లోనే పంచాయితీ వచ్చిందన్నారు. కల్వకుంట్ల కుటుంబంలోని పంచాయితీని సీఎం రేవంత్‌కు ముడిపెట్టడం వారి అమాయకత్వమని వీరేశం ఎద్దేవా చేశారు.