Share News

Kavitha Denies BRS: బీఆర్ఎస్‌తో నాకు సంబంధం లేదు

ABN , Publish Date - Oct 02 , 2025 | 04:30 AM

బీఆర్‌ఎ్‌సతో తనకు ఎటువంటి సంబంధం లేదని.. ఇచ్చి పుచ్చుకోవడాల్లాంటివి కూడా లేవని తెలంగాణ జాగృతి...

Kavitha Denies BRS: బీఆర్ఎస్‌తో నాకు సంబంధం లేదు

  • బీసీ జీవో ఇచ్చి.. కోర్టులో కేసులు వేయించిన రేవంత్‌రెడ్డి

  • ఈటల రాజేందర్‌ బీసీలని తప్పుదోవ పట్టించడం తగదు

  • గ్రామాల్లో తప్పుడు రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం: కవిత

హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎ్‌సతో తనకు ఎటువంటి సంబంధం లేదని.. ఇచ్చి పుచ్చుకోవడాల్లాంటివి కూడా లేవని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో బుధవారం మాట్లాడుతూ.. బాకీకార్డు అనేది ఆ పార్టీ తీసుకున్న రాజకీయ అంశమని.. దానిపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లంటూ జీవో ఇచ్చిన మరుసటి రోజే సీఎం రేవంత్‌రెడ్డి తనకు దగ్గరి వ్యక్తులతో కోర్టులో కేసులు వేయించారని ప్రచారం జరుగుతోందన్నారు. ఇక రాష్ట్రపతి వద్ద బిల్లు పాస్‌ చేయించాల్సిన బీజేపీవాళ్లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. ఎన్నికలకు వెళ్లొద్దు, ఖర్చు పెట్టిన డబ్బులు వృథా అవుతాయని, ఫలితాలు వచ్చాక కోర్టుకు వెళ్లి రద్దు చేయిస్తామని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించడం ద్రోహపూరిత చర్య అన్నారు. ఈ ఎన్నికలకు ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్లు తప్పుల తడకగా ఉన్నాయన్నారు. ఎస్సీ వర్గీకరణ పూర్తిచేశామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఈ రిజర్వేషన్లలో వర్గీకరణను చూపకుండా వారిని కూడా మోసగించారన్నారు. ఎన్‌డీఎ్‌సఏ నివేదిక ఆధారంగా మేడిగడ్డను బాగు చేసేందుకు ముందుకు వచ్చిన ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయం చేయకుండా.. నాణ్యమైన పద్ధతిలో బాగు చేయించాలన్నారు.

Updated Date - Oct 02 , 2025 | 04:30 AM