Share News

Kavitha consoles Harish Raos family: హరీశ్‌రావును పరామర్శించిన కవిత

ABN , Publish Date - Oct 31 , 2025 | 02:41 AM

మాజీ మంత్రి హరీశ్‌రావును, ఆయన కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు...

Kavitha consoles Harish Raos family: హరీశ్‌రావును పరామర్శించిన కవిత

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి హరీశ్‌రావును, ఆయన కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. తన భర్త అనిల్‌తో కలిసి గురువారం హరీశ్‌ నివాసానికి వెళ్లిన ఆమె.. హరీశ్‌ తండ్రి తన్నీరు సత్యనారాయణరావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీశ్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు కవిత దంపతులు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

నదీజలాల ఎత్తిపోతలపై సర్కార్‌ మౌనమేల?

వరద జలాలను తక్కువ ఖర్చుతో మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నింపుకొనే అవకాశం ఉన్నా.. రేవంత్‌రెడ్డి సర్కార్‌ గోదావరి జలాల ఎత్తిపోతలపై ఎందుకు మౌనంగా ఉంటోందని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. మిడ్‌మానేరు నుంచి అనంతగిరి, రంగనాయకసాగర్‌ మీదుగా నీటిని ఎత్తిపోసేందుకు ఈ ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయడం లేదని గురువారం ఎక్స్‌లో విమర్శించారు. భారీవర్షాల నేపథ్యంలో గోదావరి వరదజలాలు సముద్రంలోకి వృథాగా చేరడం బాధాకరమని, అదేసమయంలో మిడ్‌మానేరు, లోయర్‌మానేరు గేట్లు ఎత్తి వేల టీఎంసీల నీటిని నదిలోకి వదలడం ప్రభుత్వ అనాలోచిత చర్యకు నిదర్శనమని అన్నారు.

Updated Date - Oct 31 , 2025 | 02:41 AM