Kavitha Accuses Mallareddy: ఆస్తులు పెంచుకున్నారే తప్ప అభివృద్ధి సున్నా
ABN , Publish Date - Dec 08 , 2025 | 04:27 AM
మేడ్చల్ జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్న మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి..
మల్లారెడ్డిపై కవిత తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్/బిట్స్‌పిలానీ/కీసర రూరల్, డిసెంబర్ 7, (ఆంధ్రజ్యోతి): మేడ్చల్ జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్న మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి.. అక్రమ అస్తులు పెంచుకున్నారే తప్ప, చేసిన అభివృద్ధి శూన్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో ఆదివారం జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని డంపింగ్ యార్డును సందర్శించిన తర్వాత స్థానిక డ్వాక్రా మహిళలతో బస్తీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం డంపింగ్ సమస్యపై కొంత మేర కృషి చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. కాగా, పంచాయతీ ఎన్నికల పోలింగ్ రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాతపరీక్ష నిర్వహించడం తగదన్నారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని ఈనెల 14న తలపెట్టిన ఏపీపీ రాత పరీక్ష వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.