kumaram bheem asifabad- ఆత్మరక్షణకు కరాటే
ABN , Publish Date - Nov 27 , 2025 | 10:28 PM
సమాజంలో ఎదురయ్యే ఘటనలను ఎదుర్కొనేం దుకు విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిచాలనే లక్ష్యంతో ప్రభుత్వం కరాటే శిక్షణకు శ్రీకారం చుట్టింది. బాలికలు, మహిళల రక్షణ కోసం కరాటే ఎంతగానో ఉపయోగపడుతుంది. విద్యార్ధి దశలోనే బాలికలకు ఆత్మవిశ్వాసం పెరిగేలా ప్రభుత్వం పాఠశాలల్లో ఆత్మ రక్షణ విద్య(కరాటే) నేర్పించాలని ప్రభుత్వం పీఎంశ్రీ పాఠశాలలను ఎంపిక చేసి నిధులు కేటాయించింది. బాలికలకు కరాటే, కుంగ్‌ఫూ, జూడో వంటి విద్య నేర్పించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
- ఆసక్తి చూపుతున్న చిన్నారులు
రెబ్బెన, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): సమాజంలో ఎదురయ్యే ఘటనలను ఎదుర్కొనేం దుకు విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిచాలనే లక్ష్యంతో ప్రభుత్వం కరాటే శిక్షణకు శ్రీకారం చుట్టింది. బాలికలు, మహిళల రక్షణ కోసం కరాటే ఎంతగానో ఉపయోగపడుతుంది. విద్యార్ధి దశలోనే బాలికలకు ఆత్మవిశ్వాసం పెరిగేలా ప్రభుత్వం పాఠశాలల్లో ఆత్మ రక్షణ విద్య(కరాటే) నేర్పించాలని ప్రభుత్వం పీఎంశ్రీ పాఠశాలలను ఎంపిక చేసి నిధులు కేటాయించింది. బాలికలకు కరాటే, కుంగ్‌ఫూ, జూడో వంటి విద్య నేర్పించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేవలం శిక్షణకే కాకుండా ఉత్తీర్ణత పరీక్ష కూడా రాయించి వారికి ధ్రువపత్రాలు కూడా అందిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శిక్షణ కోసం నిపుణులను నియామక ప్రక్రియ పూర్తి చేసింది. జిల్లాలో పీఎంశ్రీ పాఠశాలల్లో కరాటే శిక్షణ నేర్పిస్తున్నారు. ప్రతి పాఠశాలలో వారానికి ఆరు సార్లు శిక్షణ ఇస్తున్నారు. ఆరు నుంచి పదో తరగతి బాలికలకు 50 మంది లోపు ఉంటే శిక్షకులకు రూ.15వేలు, 50 మంది కంటే ఎక్కువగా ఉంటే రూ.30వేల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో బాలికలు 50 మంది లోపు ఉన్న పాఠశాలలు 5, 50 మంది కంటే ఎక్కువగా ఉన్నవి 65 ఉన్నట్టు విద్యా శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలోని 70 పాఠశాలను ఎంపిక చేశారు. ఇందుకు రూ.20.25లక్షల నిధులు విడుదల చేశారు. శిక్షకులను జిల్లా స్పోర్ట్స్ డెవలప్‌మెంటు ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. ఈ తరగతులను పీఈటీ లేదా పీడీ పర్యవేక్షణలో 45 నిమిషాలు పాటు శిక్షణ నిర్వహిస్తున్నారు.
కరాటే శిక్షణ ఉపయోగకరంగా ఉంది..
-పి.హిమబిందు, ఆరో తరగతి, జడ్పీహెచ్‌ఎస్, రెబ్బెన
కరాటే శిక్షణ ఉపయోగకరంగా ఉంది..శిక్షణకు నిత్యం హాజరవుతున్నాను. శిక్షకుడు నేర్పించిన సూచనలు, సలహాలు తప్పకుండా పాటిస్తున్నాం. శిక్షణకు ముందు కంటే మాలో ఆత్మ విశ్వాసం వచ్చింది. ఆపద ఎదురైన ప్పుడు ఎలా ఎదుర్కొవాలో శిక్షకులు నేర్పుతు న్నారు. చ దువుతో పాటు కరాటే నేర్చుకోవడంపై దృష్టి సారించాం.