Share News

Kalvakuntla Kavita: కవితకు చింతమడక వాసుల ఆహ్వానం

ABN , Publish Date - Sep 12 , 2025 | 04:19 AM

బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈ నెల 21న నిర్వహించే ఎంగిలిపూల బతుకమ్మ పండుగకు రావాలని.. కేసీఆర్‌ సొంతూరు...

Kalvakuntla Kavita: కవితకు చింతమడక వాసుల ఆహ్వానం

హైదరాబాద్‌, సెప్టెంబరు 12: బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈ నెల 21న నిర్వహించే ఎంగిలిపూల బతుకమ్మ పండుగకు రావాలని.. కేసీఆర్‌ సొంతూరు చింతమడక వాసులు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఆహ్వానించారు. ఆ గ్రామానికి చెందిన ప్రజలు బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయానికి చేరుకొని.. కవితతో భేటీ అయిన సందర్భంగా వారు ఆమెను చింతమడకకు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గొప్ప ఉద్యమకారుడిని కన్న గొప్ప ఊరు చింతమడక అని, బతుకమ్మ వేడుకకు తనను అక్కడికి ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. చింతమడక నుంచి ఎంతో నేర్చుకున్నానని, తన చిన్నప్పుడు ఆ గ్రామంలో బతుకమ్మ ఆడిన రోజులు ఇంకా కళ్లముందే ఉన్నాయన్నారు.. ఈ సమయంలో గ్రామస్తులు తన వద్దకు రావడం ఎంతో ధైర్యం కలిగించిందని కవిత పేర్కొన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 02:04 PM