ప్రజా సేవకు కాళోజీ జీవితం స్ఫూర్తి
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:25 PM
ప్రజా సేవలకు కాళోజీ జవితం స్ఫూర్తి అ ని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
- కలెక్టర్ బదావత్ సంతోష్
- కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఘన నివాళి
నాగర్‌కర్నూల్/ కందనూలు/ కల్వకుర్తి/ కొ ల్లాపూర్/ పెద్దకొత్తపల్లి/ వెల్దండ/ ఊర్కొండ/ తెలకపల్లి/ కోడేరు/ ఉప్పునుంతల/ బల్మూరు/ అమ్రాబాద్/ లింగాల, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యో తి) : ప్రజా సేవలకు కాళోజీ జవితం స్ఫూర్తి అ ని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. స్థానిక ఐ డీవోసీ కార్యాలయ ఆవరణలో ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతికి కలెక్టర్ ముఖ్య అ తిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కాళోజీ చి త్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పిం చారు. కలెక్టర్ మాట్లాడుతూ తన ప్రతీ అక్షరాన్ని తెలంగాణ ప్రజల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం అన్న ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంతి నేడు జరుపు కుంటున్నామని ఆయన అన్నా రు. ప్రజాకవి కాళోజీ నారాయ ణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకో వడం గొప్ప విశేషమన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారి యాదగిరి, క లెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, బీసీ సంక్షేమ సహాయ అధికారి శ్రీరాములు, స్పోర్ట్స్ అధికారి సీతారాం నాయక్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ (ఆర్ట్స్ అండ్ కామర్స్) కళాశాలలో ప్రిన్సిపాల్ గీతాంజలి ఆధ్వర్యంలో కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పిం చారు. కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాళోజీ చిత్ర పటానికి ప్రిన్సిపాల్ శర్వాణీ, అధ్యాపకులు, వైఆర్‌ఎం డిగ్రీ కళాశా లలో ప్రిన్సిపాల్ సదానందంగౌడ్, అధ్యాపకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. పెద్దకొత్తపల్లి, వెల్దండ, ఊర్కొండ, తెలకపల్లి, కోడేరు, ఉప్పునుంతల, బల్మూరు, అమ్రాబాద్, లింగాల మండలాల్లో కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసిన ఘన నివాళి అర్పించారు.