Indira Bhavan: ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో కడియం శ్రీహరి!
ABN , Publish Date - Dec 14 , 2025 | 07:12 AM
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి శనివారం స్థానిక ఇందిరా భవన్‌లో ప్రత్యక్షమయ్యారు.
న్యూఢిల్లీ, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి శనివారం స్థానిక ఇందిరా భవన్‌లో ప్రత్యక్షమయ్యారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండడం, అనర్హత విషయంలో స్పీకర్ చర్యలపై చర్చ జరుగుతున్న వేళ కడియం శ్రీహరి తన కుమార్తె, ఎంపీ కడియం కావ్యతో కలిసి ఇందిరాభవన్‌కు వచ్చారు. పార్టీ ఎస్సీ విభాగం అడ్వైజరీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారిక మీడియా గ్రూప్ విడుదల చేసిన ఫొటోల్లో కడియం శ్రీహరి ఉడగా.. ఈ విషయమై కడియం కావ్య మాట్లాడుతూ తన కోసమే నాన్న వచ్చారని,పార్టీ కార్యాలయాన్ని చూపించడానికి తీసుకువచ్చానని చెప్పారు.