Share News

Bandi Sanjay: జీఎస్టీ సంస్కరణలతో పేదలకు న్యాయం

ABN , Publish Date - Sep 22 , 2025 | 05:25 AM

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో పేదలకు న్యాయం జరుగుతుందని కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

Bandi Sanjay: జీఎస్టీ సంస్కరణలతో పేదలకు న్యాయం

మహనీయుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ: సంజయ్‌

కరీంనగర్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో పేదలకు న్యాయం జరుగుతుందని కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆదివారం కరీంనగర్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు జరిగిన నష్టమేంటో చెప్పకుండా ఇడ్లీ, దోశ, వడ అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం సొంత ఇంటినే త్యాగం చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్‌ బాపూజీ అన్నారు. 96 ఏళ్ల వయస్సులో తెలంగాణ కోసం జంతర్‌మంతర్‌ వద్ద ఎముకలు కొరికే చలిలో దీక్ష చేసిన నాయకుడని కొనియాడారు.

Updated Date - Sep 22 , 2025 | 05:25 AM