Mallu Ravi: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి గెలుపుతోనే దేశ ప్రజలకు జస్టిస్
ABN , Publish Date - Sep 08 , 2025 | 02:59 AM
దేశ ప్రజలకు జస్టిస్ న్యాయం జరగాలంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలవాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి..
బీజేపీవి కపట నాటకాలు: వీహెచ్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రజలకు జస్టిస్ (న్యాయం) జరగాలంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలవాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ ఆయనకు ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాలులో ప్రతిపక్ష పార్టీల మాక్ పోలింగ్ ఉందని తెలిపారు. ఇటీవల పార్లమెంట్‌ను మోదీ నడిపించిన విధానాన్ని చూస్తే.. స్వాతంత్య్రం రాకముందు పరిస్థితులను దేశ ప్రజలు మళ్లీ చూడాల్సి వచ్చిందన్నారు. సెప్టెంబరు 17న కేంద్రం తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతున్నట్టు ప్రకటించిందని, అయితే ఆనాడు తెలంగాణకు కొంతమంది వల్లే స్వాతం త్య్రం రాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. తెలంగాణ విముక్తి ఉద్యమంలో బీజేపీ పాత్రే లేదని.. ఇకనైనా ఆ పార్టీ కపట నాటకాలు కట్టిపెట్టాలన్నారు. 1947లో నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా సా యుధ పోరాట యోధులు, కాంగ్రెస్ నాయకులు పోరాడారని చెప్పారు.