Share News

Justice Shyankoshi: జాతీయ న్యాయ సేవల అథారిటీ బోర్డు సభ్యుడిగా జస్టిస్‌ శ్యాంకోషీ

ABN , Publish Date - Dec 06 , 2025 | 05:27 AM

తెలంగాణ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి, స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ శ్యాంకోషీ జాతీయ న్యాయ సేవల అథారిటీ బోర్డు సభ్యుడిగా ఎంపికయ్యారు...

Justice Shyankoshi: జాతీయ న్యాయ సేవల అథారిటీ బోర్డు సభ్యుడిగా జస్టిస్‌ శ్యాంకోషీ

హైదరాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి, స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ శ్యాంకోషీ జాతీయ న్యాయ సేవల అథారిటీ బోర్డు సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ బోర్డుకు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంపికైన తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు. ప్రస్తుతం ఎంపికైన తొమ్మిది మంది సభ్యుల్లో హైకోర్టు సిట్టింగ్‌ జడ్జిగా పనిచేస్తున్నది జస్టిస్‌ శ్యాంకోషీ ఒక్కరే కావడం విశేషం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపిన అనంతరం కేంద్ర న్యాయశాఖ ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీచేసింది.

Updated Date - Dec 06 , 2025 | 05:27 AM