బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:22 PM
నేరస్థులకు శిక్ష పడితేనే నేరా ల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. రామగుండం కమిషనరేట్ కా ర్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లలో పని చేస్తున్న కోర్టు డ్యూటీ అధికా రులకు, లైజనింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాల క్రైం, సెప్టెంబర్ 20(ఆంధ్రజ్యోతి) : నేరస్థులకు శిక్ష పడితేనే నేరా ల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. రామగుండం కమిషనరేట్ కా ర్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లలో పని చేస్తున్న కోర్టు డ్యూటీ అధికా రులకు, లైజనింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ నేరస్థులకు శిక్ష పడేలా సాక్షులను ప్రవేశపెట్టి ట్రయల్ సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రమేష్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, లీగల్ సెల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు పాల్గొన్నారు.
భీమారానికి చెందిన మూగ, చెవిటి బాలికను అత్యాచారం చేసిన పోక్సో కేసులో దోషికి శిక్ష పడేందుకు కృషి చేసిన అనువాదకుడు యేసేపును శనివారం సీపీ అభినందించారు. బాధితురాలు తెలియపరిచిన వివరాలను అనువాదం చే సి కోర్టులో వివరించారని, ఈ కేసులో దోషికి న్యాయమూర్తి 20ఏళ్ల జైలు శిక్ష, రూ.12500 జరిమానా విధించారని, బాధితురాలికి రూ.7లక్షల పరిహారం ఇస్తూ తీర్పునిచ్చారన్నారు. కేసులో కీలకపాత్ర పోషించిన యేసేపును సీపీ సన్మానించారు.