రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేయాలి
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:20 PM
పట్టణంలోని శిశుమందిర్ రోడ్డు విస్తరణలో భాగంగా ఉపాధి కోల్పోయిన వ్యాపారులకు నిరుపేదలకు న్యా యం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీజేపీ నాయకులు బాధి తులతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే, మున్సిపల్ కార్యాలయం ముందు ధ ర్నా చేపట్టారు.
బీజేపీ నాయకుల ధర్నా
బెల్లంపల్లి,నవంబరు21(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శిశుమందిర్ రోడ్డు విస్తరణలో భాగంగా ఉపాధి కోల్పోయిన వ్యాపారులకు నిరుపేదలకు న్యా యం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీజేపీ నాయకులు బాధి తులతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే, మున్సిపల్ కార్యాలయం ముందు ధ ర్నా చేపట్టారు. ఈసందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి మాట్లాడుతూ ఎక్కడ లేని విధంగా బెల్లంపల్లిలో 60ఫీట్లు, వంద ఫీట్ల రోడ్లను ఏర్పాటు చేస్తూ వీధి వ్యాపారులను, నిరుపేదలను భయ బ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. రోడ్డు వెడల్పులో ఉపాధి కోల్పోతున్న వ్యాపారులకు ఇండ్లు కోల్పోతున్న నిరుపేదలకు ప్రభుత్వ పరంగా సాయం చేయాలన్నారు. సమస్యలు పట్టించుకోకుండా స్థానిక ఎమ్మెల్యే హైదరాబా ద్‌కే పరిమితమవడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎ మ్మెల్యే లేకపోవడంతో క్యాంప్ కార్యాలయం గేటుకు వినతిపత్రం అందిం చాల్సిన దుస్థితి ఏర్పడ్డదన్నారు. శిశుమందిర్ రోడ్డు విస్తరణలో 60ఫీట్ల నుంచి 40తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే చిరువ్యాపారులకు ఉ పాధి కల్పించాలని, ఇండ్లు పోగొట్టుకున్న వారికి డబుల్‌బెడ్ రూం ఇండ్లు కేటాయించాలన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి సంతోష్ కుమార్, నాయకులు పులగం తిరుపతి, గోవర్ధన్, శనిగారపు శ్రావణ్, నవీన్ కు మార్, రామ్మోహన్, సంతోష్ పాల్గొన్నారు.