Share News

kumaram bheem asifabad-శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలి

ABN , Publish Date - Nov 02 , 2025 | 10:21 PM

కుల దురహంకార హత్యకు గురైన శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మాలి సంఘం భవనంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌంటేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళా తలండి శ్రావణి అనే నిండు గర్భిణీ హత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

kumaram bheem asifabad-శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలి
రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు

ఆసిఫాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కుల దురహంకార హత్యకు గురైన శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మాలి సంఘం భవనంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌంటేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళా తలండి శ్రావణి అనే నిండు గర్భిణీ హత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. హత్య జరిగి 15 రోజులు గడుస్తుఆన్న జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఆ గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబానికి భరోసా కల్పించలేదని ఆరోపించారు. ఫాస్ట్‌ ట్రాక్ట్‌ కోర్టు ఏర్పాటు చేసి ఆరు నెలల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌ గ్రేషియా, అయిదు ఎకరాల భూమితో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 10న జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తీర్మాణించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దినకర్‌, చిరంజీవి, కార్తీక్‌, రాజేందర్‌, కృష్ణమాచారి, చిన్నయ్య, నరసింహారావు, జయరాం, రవీందర్‌, శంకర్‌, రాజు, మారుతి, టికానంద్‌, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2025 | 10:21 PM