Justice G. Radharani: రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలిగా..జస్టిస్ రాధారాణి బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Dec 23 , 2025 | 03:53 AM
రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలిగా జస్టిస్ జి. రాధారాణి సోమవారం అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు...
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలిగా జస్టిస్ జి. రాధారాణి సోమవారం అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. వినియోగదారుల కమిషన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి.. లోకాయుక్త చైర్మన్ జస్టిస్ ఏ. రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జస్టిస్ జి. రాధారాణికి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం రిజిస్ట్రార్ యన్. రామ్‌కుమార్, వినియోగదారుల కమిషన్ సభ్యులు, సిబ్బంది, పలువురు న్యాయవాదులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.