Share News

Telangana Politics: జూబ్లీహిల్స్‌ గెలుపు.. దేశ కాంగ్రెస్‌ భవిష్యత్తును మారుస్తుంది

ABN , Publish Date - Oct 17 , 2025 | 02:24 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో గెలుపు దేశ కాంగ్రెస్‌ రాజకీయ భవిష్యత్తును మారుస్తుందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌...

Telangana Politics: జూబ్లీహిల్స్‌ గెలుపు.. దేశ కాంగ్రెస్‌ భవిష్యత్తును మారుస్తుంది

  • కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌

  • ఈ ఉప ఎన్నికతో బీఆర్‌ఎస్‌ శకం ముగిసినట్లే..: మహేశ్‌ గౌడ్‌

బంజారాహిల్స్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో గెలుపు దేశ కాంగ్రెస్‌ రాజకీయ భవిష్యత్తును మారుస్తుందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ వ్యాఖ్యానించారు. సోమాజిగూడ డివిజన్‌ బూత్‌స్థాయి కమిటీ సమావేశం శాలివాహననగర్‌ కమ్యూనిటీహాల్‌లో, రహ్మత్‌నగర్‌ డివిజన్‌ బూత్‌స్థాయి కమిటీ సమావేశం మెహబూబ్‌ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం నిర్వహించారు. ఆయా సమావేశాలకు మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రులు వివేక్‌ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌ ముఖ్య అతిథులుగా హాజరవ్వగా.. జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నికలో నవీన్‌యాదవ్‌ ఒక్కడే పోటీ చేయడం లేదని, కాంగ్రెస్‌ శ్రేణులంతా కూడా పోటీలోనే ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ విజయానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికతో బీఆర్‌ఎస్‌ శకం ముగుస్తుందని, ఈ సీటు కూడా కాంగ్రెస్‌ ఖాతాలో పడటం ఖాయమని చెప్పారు. ప్రజాభిప్రాయం మేరకు నవీన్‌యాదవ్‌కు టికెట్‌ ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ గెలిస్తే నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన అనంతరం అభివృద్ధిలో వేగం పెరిగిందని తుమ్మల అన్నారు. బీసీ రిజర్వేషన్ల ద్వారా సామాజిక న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తే విపక్షాలు దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని పొన్నం మండిపడ్డారు. కాగా, యూసు్‌ఫగూడ డివిజన్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకురాలు ఆదిలక్ష్మి మరికొంత మంది కార్యకర్తలతో కలిసి కాంగ్రె్‌సలో చేరారు. వారికి మీనాక్షి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

Updated Date - Oct 17 , 2025 | 02:24 AM