Traffic Inspector Narsingarao: జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటు
ABN , Publish Date - Dec 18 , 2025 | 02:38 AM
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో చలాన్లను తొలగించడానికి లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నర్సింగరావును ...
ట్రాఫిక్ ఎస్సై, హోంగార్డు, ఓ కానిస్టేబుల్‌పైన కూడా
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో చలాన్లను తొలగించడానికి
లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలతో చర్యలు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో చలాన్లను తొలగించడానికి లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నర్సింగరావును హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ బదిలీ చేశారు. ఈ ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ఆదేశించారు. నర్సింగరావు అవినీతి వ్యవహారంపై ఈ నెల 16న ఆంధ్రజ్యోతిలో ‘‘రూ.10వేలు, బిర్యానీ ప్యాకెట్‌లు’’ పేరుతో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ కథనం ఆధారంగానే సజ్జనార్ స్పందించారు. ఈ వ్యవహారంలో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఎస్సై అశోక్, హోంగార్డు కేశవులుతో పాటు కానిస్టేబుల్ సుధాకర్‌ను కూడా బదిలీ చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. డ్రంకెన్ డ్రైవ్ చలాన్లు మాఫీ చేసేందుకు వీరు పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్లుగా పలు ఫిర్యాదులున్నాయి. విధుల్లో నిర్లక్షం, అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తప్పవని సజ్జనార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.