CM Revanth Reddy: జూబ్లీహిల్స్ మనదే!
ABN , Publish Date - Nov 11 , 2025 | 02:33 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ బీఆర్‌ఎస్ బలహీనపడిందని సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర మంత్రులతో అన్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కాంగ్రెస్....
అయినా ఈ ఒక్కరోజు అప్రమత్తంగా ఉందాం
ఓటింగ్ శాతం పెరిగేలా చూడండి
పోలింగ్ అయ్యేదాకా అందుబాటులో ఉండండి
మంత్రులతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో సీఎం
హైదరాబాద్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ బీఆర్‌ఎస్ బలహీనపడిందని సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర మంత్రులతో అన్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ విజయం ఖాయమని చెప్పారు. అయినా పోలింగ్ రోజు అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు. ఆయా మంత్రులు తాము ఇన్‌చార్జులుగా ఉన్న డివిజన్ల నాయకులకు మంగళవారం మొత్తం అందుబాటులో ఉండాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే పరిష్కరించాలని నిర్దేశించారు. సోమవారం ఉదయం అందుబాటులో ఉన్న మంత్రులతో తన నివాసంలో ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఉప ఎన్నికలో పార్టీ పరిస్థితిపై డివిజన్ల వారీగా సమీక్షించారు. పోలింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారికి సూచించారు. ఉదయమే కాంగ్రెస్ కార్యకర్తలు, సానుభూతి పరులతో ఓట్లు వేయించడం పూర్తి చేయాలని, ఓటర్లను పోలింగ్ కేంద్రం వరకూ బాధ్యులు తీసుకువచ్చేలా చూసుకోవాలని అన్నారు. పోలింగ్ శాతం పెరిగితే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పెరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రులతోపాటు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు.