Share News

Jubilee Hills Final Voter List: జూబ్లీహిల్స్‌లో 3.99 లక్షల మంది ఓటర్లు

ABN , Publish Date - Oct 01 , 2025 | 03:04 AM

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉప ఎన్నికను స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా...

Jubilee Hills Final Voter List: జూబ్లీహిల్స్‌లో 3.99 లక్షల మంది ఓటర్లు

  • నియోజకవర్గం తుది ఓటరు జాబితా విడుదల

  • పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌.వి.కర్ణన్‌ సమావేశం

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉప ఎన్నికను స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ కోరారు. త్వరలో జరగనున్న ఈ ఎన్నికల నేపఽథ్యంలో మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తుది ఓటరు జాబితాను విడుదల చేసినట్లు కమిషనర్‌ తెలిపారు. తుది జాబితా ప్రకారం.. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని 407 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 3,98,982 మంది ఓటర్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఓటర్లు తమ పేరును ఈసీఐ, సీఈవో వెబ్‌సైట్ల ద్వారా లేదా ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌లో తనిఖీ చేసుకోవచ్చు. రాజకీయ పార్టీలు, పౌరులు నామినేషన్ల చివరి తేదీ వరకు ఫారం-7, ఫారం-8 ద్వారా అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉందని కమిషనర్‌ వివరించారు. జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన అర్హులు, ఇప్పటికీ ఓటరుగా నమోదు చేసుకోని వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Updated Date - Oct 01 , 2025 | 03:04 AM