కాంగ్రెస్‌లో జోష్...!
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:27 PM
పంచా యతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. మొదటి రెండు విడుతల్లో సత్తా చాటిన హస్తం పార్టీ అభ్యర్థులు మూడో విడుత లోనూ అదే ఉత్సాహం కనబరిచారు. జిల్లాలో మొత్తం 306 పచాయతీలు ఉండగా, అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించారు.
-సత్తా చాటిన హస్తం పార్టీ మద్దతు దారులు
-సింహ భాగం సర్పంచ్ స్థానాలు కైవసం
-ద్వితీయ స్థానానికి పరిమితమైన బీఆర్‌ఎస్ అభ్యర్థులు
-తృతీయ స్థానంలో నిలిచిన స్వతంత్రులు
-బోణీ కొట్టిన బీజేపీ మద్దతుదారులు
మంచిర్యాల, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పంచా యతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. మొదటి రెండు విడుతల్లో సత్తా చాటిన హస్తం పార్టీ అభ్యర్థులు మూడో విడుత లోనూ అదే ఉత్సాహం కనబరిచారు. జిల్లాలో మొత్తం 306 పచాయతీలు ఉండగా, అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించారు. మొదటి విడుత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 11వ తేదీన నిర్వహించగా, రెండో విడుత 14వ తేదీన, మూ డో విడుత 17వ తేదీన నిర్వహించారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా మంచిర్యాల నియోజక వర్గం పరి ధిలోని హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి మండలాలతో పాటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజక వర్గం పరి ధిలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలాన్ని ఎంపి క చేయగా, మొత్తం 90 సర్పంచ్ స్థానాలను అధికా రులు గుర్తించారు. అలాగే రెండో విడుతలో బెల్లంపల్లి నియోజక వర్గం పరిధిలోని తాండూరు, బెల్లంపల్లి, నె న్నెల, భీమిని, వేమనపల్లి, కన్నెపల్లి, కాసిపేట మండ లాల్లో మొత్తం 114 స్థానాలను గుర్తించారు. అలాగే మూడో విడతలో భాగంగా చెన్నూరు నియోజక వర్గం పరిధిలోని కోటపల్లి, చెన్నూరు, భీమారం, జైపూర్, మం దమర్రి మండలాల్లోని 102 పంచాయతీలను గుర్తిం చారు. మూడు విడతల్లోని మొత్తం స్థానాల్లో వివిధ కా రణాల చేత నాలుగు పంచాయతీల్లో ఎన్నికలు జరుగ లేదు. ఇందులో దండేపల్లి మండలంలోని గూడెం, నె ల్కి వెంకటాపూర్, వందురుగూడతోపాటు వేమనపల్లి మండలంలోని రాజారం పంచాయతీలు ఉన్నాయి. మి గిలిన 302 పంచాయతీల్లో హస్తం పార్టీ మద్దతు తె లిపిన అభ్యర్థులు తమ సత్తా చాటారు. ఏకంగా 62 శాతం మెజారిటీ సాధించడం ద్వారా పల్లెల్లో కాంగ్రెస్ జెండా ఎగుర వేశారు. పంచాయతీ ఎన్నికల విజయం తో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.
186 స్థానాలు కైవసం....
మూడు విడుతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు సింహ భాగం స్థానా లను కైవసం చేసుకోవడం ద్వారా తమ సత్తాను చా టారు. మూడు విడతల్లో మొత్తం 186 స్థానాలను కైవ సం చేసుకొని విజయ ఢంకా మోగించారు. మొదటి వి డతలో నాలుగు మండలాల్లోని 87 స్థానాల్లో 53 సీట్ల ను కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా, రెండో విడుతలో ఏడు మండలాల్లోని 113 స్థానాల్లో 81 సీట్లు, మూడో విడుతలో ఐదు మండలాల్లోని 102 స్థానాలకు గాను 52 సీట్లను సొంతం చేసుకొని విజయ దుందుభి మోగించారు.
ద్వితీయ స్థానానికే పరిమితమై బీఆర్‌ఎస్ అభ్యర్థులు....
జిల్లాలో జరిగిన మూడు విడుతల పంచాయతీ ఎ న్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ద్వితీ య స్థానానికే పరిమితం అయ్యారు. మొత్తం 302 స ర్పంచ్ స్థానాలకు గాను కేవలం 57 స్థానాల్లో విజ యం సాధించి తమ ఉనికిని కాపాడుకున్నారు. మొద టి విడతలో 87 స్థానాల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు 16 సీట్లు సాధించగా, రెండో విడతలోని 113 స్థానాల్లో 25 సీట్లు, మూడో విడతలోని 102 స్థానాలకు గాను 16 సీట్లు సాధించారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌కు కంచు కోటై న మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లి, లక్షె ట్టిపేట మండలాల్లోనూ ఆ పార్టీ బలపరిచిన అభ్య ర్థులు పెద్దగా రాణించలేదు. అలాగే రెండో విడుతలో బెల్లంపల్లి నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య సొంత మండలమైన నెన్నెలతోపాటు నియోజక వర్గ కేంధ్రమైన బెల్లంపల్లిలోనూ ఆశించిన మేర ఫలి తాలు రాలేదు. ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రాతినిథ్యం వహించిన చెన్నూరు ని యోజక వర్గంలోనూ సత్ఫలితాలు లభించలేదు. ఎన్నిక లకు ముందు చివరి రెండు రోజులు బాల్క సుమన్ నియోజక వర్గంలో విసృతంగా పర్యటించినప్పటికీ ఓట ర్లు కనికరించలేదు. ఫలితంగా పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతు దారులు ద్వితీయ స్థానంతో సరిపె ట్టుకోవలసి వచ్చింది. ఇక బీజేపీ గతంలో ఎన్నడూ లే ని విధంగా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పలు స ర్పంచ్ స్థానాలను సాదించడం ద్వారా బోణీ కొట్టింది. మొదటి విడుత ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్య ర్థులు ఐదారుగురు విజయం సాధించడంతో బీజేపీ ముఖ్య నేతలు ఆనందోత్సాహాల్లో తేలియాడుతున్నారు. ఈ ఎన్నికల్లో సాధించిన విజయమే రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లకు రెఫరెండం అనే వ్యాఖ్యలు ఆ పార్టీ నాయకు ల ద్వారా వినిపిస్తున్నాయి. అయితే రెండు, మూడు వి డతల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు ఒక్క స్థానాన్ని కూడా గెలవకపోవడం ఆ పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదు.
స్వతంత్రులకు పట్టం....
పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు అధికార కాంగ్రెస్ తరువాత స్వతంత్రులుగా బరిలోకి దిగిన అభ్యర్థులకే పట్టం కట్టారు. మూడు విడతల్లో స్వతంత్రులు మొత్తం 49 స్థానాలు సాధించి, బీఆర్‌ఎస్ అభ్యర్థుల సరసన నిలిచారు. మొదటి విడుత ఎన్నికల్లో 9, రెండో విడ తలో 6 స్థానాలకే పరిమితమైన స్వతంత్ర అభ్యర్థులు మూడో విడతలో మాత్రం అమాంతం దూసుకుపో యారు. మూడో విడత ఎన్నికల్లో ఏకంగా 34 స్థానాల్లో విజయబావుటా ఎగురవేశారు.
ఖర్చుకు వెనకాడని అభ్యర్థులు...
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి సర్పంచ్ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం కొనసాగింది. జిల్లాలోని వి విధ గ్రామాల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు విపరీ తంగా ఖర్చు చేశారు. ఆయా గ్రామాల్లో తమ కుటుం బ సభ్యులను సర్పంచ్‌గా గెలిపించుకునేందుకు రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఖర్చు చేసేం దుకైనా వెనుకాడలేదు. కొన్ని చోట్లా అంతకు మించి కూడా ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. భీమా రం మండలంలోని ఓ పంచాయతీలో గెలుపొందిన అ భ్యర్థి తరుపున కుటుంబీకులు ఏకంగా రూ. కోటి వర కు ఖర్చు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. సర్పంచ్ పదవిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పలువు రు అభ్యర్థుల తరుపున పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన ట్లు తెలుస్తోంది.