Share News

v

ABN , Publish Date - Sep 14 , 2025 | 11:32 PM

రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్‌ పాలనపై విసుగు చెంది వివిధ పార్టీల నాయకులు, కార్యక ర్తలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతు న్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు.

v
ఎర్రన్నబావితండాలో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డిని సన్మానిస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

- కాంగ్రెస్‌ నాయకుల చేరికపై మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి

కోడేరు, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్‌ పాలనపై విసుగు చెంది వివిధ పార్టీల నాయకులు, కార్యక ర్తలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతు న్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివా రం మండల పరిధిలోని ఎర్రన్న బావితండాలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను బీరం గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. మాజీ ఎమ్మె ల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ పాలకులు అక్రమ కేసులు పెట్టి బెదిరించినా, సంక్షేమ పథకాలకు ఎంపిక చేయరి తెలిసిన నిర్బంధాలు ఎదురైనా బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు ధూరెడ్డి రఘువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ ఎస్‌ పార్టీలో చేరిన దూద్వి నాయక్‌, విష్ణునాయక్‌, శ్రీనునా యక్‌, శివనాయక్‌, అంజి నాయక్‌, స్వామినా యక్‌, వెంకటేష్‌ నాయక్‌, చందు, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 11:32 PM