Share News

ఇండస్ట్రియల్‌ హబ్‌తో ఉద్యోగావకాశాలు...

ABN , Publish Date - Jul 14 , 2025 | 11:45 PM

మం చిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వేంప ల్లిలో ఏర్పాటు కానున్న ఇండస్ట్రియల్‌ కారిడార్‌ తో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అ వకాశాలు లభించనున్నాయి.

ఇండస్ట్రియల్‌ హబ్‌తో ఉద్యోగావకాశాలు...

-276 ఎకరాల్లో ఐటీ పార్క్‌ ఏర్పాటు

-సుమారు 2వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి

-త్వరలో ప్రారంభం కానున్న పనులు

మంచిర్యాల, జూలై 14 (ఆంధ్రజ్యోతి): మం చిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వేంప ల్లిలో ఏర్పాటు కానున్న ఇండస్ట్రియల్‌ కారిడార్‌ తో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అ వకాశాలు లభించనున్నాయి. వేంపల్లి, పోచం పాడ్‌ శివారులోగల సుమారు 276 ఎకరాల స్థ లంలో ఇండస్ట్రియల్‌ హబ్‌, ఐటీ పార్కు ఏర్పా టు కోసం ఇప్పటికే భూ సేకరణ పూర్తికాగా, ని ర్మాణ పనులకు ఈ నెల 13న ఉప ముఖ్యమం త్రి మల్లు భట్టివిక్రమార్క, పలువురు మంత్రు లు, స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు శంఖుస్థాపన చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడా ఐటీ హబ్‌ లేకపోగా మంచిర్యాల ని యోజకవర్గంలోనే దానికి అంకురార్పణ జరగ డంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇండ స్ర్టియల్‌ పార్కు ఏర్పాటుతో అర్హతగల ఈ ప్రాం త నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగు పడనుండగా, ఇతరులకు కూడా ఉపాధి అవకా శాలు లభించనున్నాయి.

వ్యాపారులతో ముఖాముఖి...

ఇండస్ట్రియల్‌ హబ్‌, ఐటీ పార్కులో పరిశ్రమ లు ఏర్పాటు చేయడానికి పెట్టుబడి దారులు, వ్యాపారులను ఆహ్వానించే క్రమంలో జిల్లా కేం ద్రంలో ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు, కలెక్టర్‌ కుమా ర్‌ దీపక్‌ల నేతృత్వంలో పరిశ్రమలశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు పలుమార్లు ప్రత్యేక ముఖా ముఖి సమావేశాలు ఏర్పాటు చేశారు. పరిశ్ర మల ఏర్పాటుకు అవసరమైన విద్యుత్‌, నీటి సౌకర్యం, రహదారుల ఏర్పాటు, తదితర సౌక ర్యాలు కల్పించనున్నట్లు హామీ ఇచ్చారు. కాగా స్థానికంగా ఖనిజ, బొగ్గు వనరులతోపాటు రైల్వే మార్గం అందుబాటులో ఉండటంతో వ్యాపారుల కు సౌలభ్యంగా ఉండనుంది. ఈ సందర్భంగా వ్యాపారులను పోత్రహించేందుకు అధికారులు అవసరమైన కార్యాచరణ చేపట్టారు. ఇదిలా ఉండగా ఇండస్ట్రియల్‌ హబ్‌, ఐటీ పార్కు ఏర్పా టు చేస్తుండగా, ఈ ప్రాంతం ఊహించని వి ధంగా అభివృద్ధి చెందడంతోపాటు ఇక్కడి భూ ముల ధరలు సైతం ఆకాశాన్నంటే అవకాశా లున్నాయి. తద్వారా స్థానిక ప్రజలకు మేలు చేకూరనుంది.

276 ఎకరాల్లో ఐటీ పార్క్‌ ఏర్పాటు....

వేంపల్లి గ్రామ శివారులో ఉన్న సర్వే నంబర్‌ లు 154, 155, 159తో పాటు సమీపంలోని మొ త్తం 276 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్‌ స్ధలాలను ఇండస్ట్రియల్‌ హబ్‌ కోసం ఎంపిక చేయగా, డైరె క్టర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ మల్సూర్‌, టీజీఐఏసీ ఎగ్జి క్యూటివ్‌ డైరెక్టర్‌ నిఖిల్‌ చక్రవర్తితోపాటు జిల్లా స్థాయి అధికారులు పరిశీలించి సంసిద్ధత తెలి పారు. గతంలో కొంతకాలం ఆ భూముల్లో కొం త భాగం మంచిర్యాల మున్సిపాలిటీ డంపింగ్‌ యార్డు కోసం వినియోగించారు. అయితే డం ప్‌యార్డు ఏర్పాటు చేసి, మున్సిపల్‌ చెత్త వేయ డం వల్ల అది కుళ్లి దుర్గంధం వ్యాపించే అవ కాశం ఉన్నందున గ్రామస్తులు అభ్యంతరం తెలి పారు. స్థలం చుట్టూ ప్రహరీ లేకపో వడం మూలంగా వర్షాకాలంలో కుళ్లిన పదార్థాలు స మీపంలోని చెరువుల్లోకి చేరే ప్రమాదం ఉన్నం దున డంపింగ్‌ యార్డును నిలిపివేయాలని కో రుతూ 2016లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చే శారు. దీంతో మున్సిపల్‌ అధికారులు సదరు స్థ లంలో చెత్త డంప్‌ను నిలిపివేశారు. ప్రస్తుతం అవే భూముల్లో ఐటీ పార్కుకు అంకురార్పణ జరుగగా, పరిశ్రమలు స్థాపించేందుకు ముందు కు వచ్చే వ్యాపారులకు స్థలం అప్పగించడమే మిగిలి ఉంది.

పేదలకు కేటాయించిన ప్రభుత్వం....

సదరు స్థలం గతంలో కొందరు భూమి లేని నిరుపేదలకు సాగు నిమిత్తం ప్రభుత్వం అసైన్డ్‌ చేసింది. కొంతకాలం పాటు భూమిని సాగుచేసి న లబ్ధిదారులు అనంతరం వదిలివేయడంతో బీ డు భూమిగా మారింది. ప్రభుత్వం నుంచి భూ ములు పొందిన లబ్ధిదారుల పేరిట అసైన్‌ మెం ట్‌ చట్టం ప్రకారం ప్రభుత్వం సాగు హక్కులు కల్పించింది. 1977లో అమల్లోకి వచ్చిన అసైన్‌ మెంట్‌ చట్టం ప్రకారం (5వ పేజీ తరువాయి)

ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన భూములను హక్కుదారులు కేవలం సా గు మాత్రమే చేయాల్సి ఉంది. క్రయ, విక్రయాలు జరిపేందుకు వీలులేదు. ప్రత్యేక పరిస్థి తుల్లో విక్రయాలు చేయాలనుకుంటే అసైన్‌మెంట్‌ చట్టం ప్ర కారం అర్హతగల వారు మాత్రమే సాగు కోసం కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. అయితే సదరు భూముల్లో అనేక మంది లబ్ధిదారులు ఇప్పటికీ సాగు చేస్తుండగా, కొంత మొత్తం మాత్రం ఇతరుల చేతుల్లోకి వెళ్లిందనే ప్రచారం జరుగుతోంది.

పరిహారం చెల్లింపులు ఇలా...

ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటు చేయబోయే భూముల లబ్ధిదారులకు పరి హారం చెల్లింపుల పట్ల కొంత వ్యతిరేకత ఏర్పడినప్పటికీ తరువాత సమస్య సద్దుమణగడంతో ఐటీ పార్కుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ప్రభుత్వపరంగా అసైన్‌ మెంట్‌ చట్టం ప్రకారం పట్టాలు పొంది ఉన్నందున ప్రస్తుత బహి రంగ మార్కెట్‌ ప్రకారం పరిహారం చెల్లించాలని లబ్ధిదారులు డిమాండ్‌ చే స్తున్నారు. ఇదే విషయమై ఎమ్మెల్యే లబ్దిదారులతో గతంలో సమావేశం ఏర్పా టు చేసి ఎకరాకు రూ. 10 లక్షలు పరిహాం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో స సేమిరా అన్నారు. ప్రస్తుతం భూముల ధర మార్కెట్‌ విలువ ప్రకారం ఎక రాకు రూ. 6.5 లక్షలు ఉంది. ప్రభుత్వం భూ సేకరణ జరుపుతున్నం దున దానికి మూడు రెట్లు చెల్లించాలనే నిబంధన ఉంది. ఆ ప్రకారం ఎకరా ఒ క్కంటికి రూ. 21 లక్షలు అవుతుందని, ఆ మేరకు చెల్లించాలని డిమాండ్‌ చే శారు. అయితే సదరు భూముల్లో చాలా మంది లబ్ధిదారులు సాగు చేయక పోవడంతో డిమాండ్‌ చేసినా ఫలితం ఉండదనే భావనతో స్థలాలు అప్పగిం చారు. దీంతో ఐటీ పార్కు ఏర్పాటుకు మార్గం సుగమం కాగా, ఇండస్ట్రియల్‌ హబ్‌పై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగానూ దాదాపు రెండు వేల మందికి ఉపాధి లభించనుంది.

Updated Date - Jul 14 , 2025 | 11:46 PM