Share News

సాంకేతిక నైపుణ్యంతో ఉద్యోగ అవకాశాలు

ABN , Publish Date - Oct 09 , 2025 | 11:14 PM

కల్వకుర్తి పట్టణంలో నూతనంగా ఏ ర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్‌ టె క్నాలజీ సెంటర్‌ (ఏసీటీ)ను కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ గురువారం సందర్శించారు.

సాంకేతిక నైపుణ్యంతో ఉద్యోగ అవకాశాలు
ఏటీసీని పరిశీలిస్తున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- కల్వకుర్తిలో ఏటీసీని పరిశీలించిన కలెక్టర్‌

కల్వకుర్తి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : కల్వకుర్తి పట్టణంలో నూతనంగా ఏ ర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్‌ టె క్నాలజీ సెంటర్‌ (ఏసీటీ)ను కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ గురువారం సందర్శించారు. సెంటర్‌లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆయన పరిశీ లించారు. సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధిం చడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో విస్తృ త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌లు గ్రామీణ ఆధు నిక సాంకేతిక విద్యను చేరువ చేస్తున్నాయని కలెక్టర్‌ అభినందించారు. కార్యక్రమంలో పాలిటె క్నికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జయమ్మ, కల్వకుర్తి తహసీ ల్దార్‌ ఇబ్రహీం, ఏటీసీ కోఆర్డినేటర్‌, ఫ్యాకల్టీ స భ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తహసీల్దార్‌ కార్యాలయం తనిఖీ

వెల్దండ (ఆంధ్రజ్యోతి) : మండల తహసీల్దా ర్‌ కార్యాలయాన్ని గురువారం కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్‌ లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలం టూ అధికారులకు సూచించారు. మొత్తం 360 దరఖాస్తులకు గాను 110 పరిష్కారం చేశారని, మిగిలిన వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కార్తిక్‌ కుమార్‌, డీటీ కిరణ్‌ కుమార్‌ ఉన్నారు.

Updated Date - Oct 09 , 2025 | 11:14 PM