kumaram bheem asifabad- జీవో 49ని ఉపసంహరించుకోవాలి
ABN , Publish Date - Jun 17 , 2025 | 11:00 PM
జీవో 49ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించు కోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు మల్రాజ్ రాంబాబు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జీవో 49 ప్రతులను దహనం చేశారు.
రెబ్బెన, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): జీవో 49ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించు కోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు మల్రాజ్ రాంబాబు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జీవో 49 ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల అటవీ భూములను కుమరం భీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటిస్తూ జీవో 49 విడుదల చేశారని అన్నారు. ఈ జీవోతో గ్రామ రహదారి సౌకర్యం, పాఠశాలలు, భవన నిర్మాణాలకు అంతరాయం కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని డిమాండో చేశారు. కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా జిల్లాప్రధాన కార్యదర్శి ఇగురపు సంజీవ్, మండల ప్రధాన కార్యదర్శి రామగిరి సతీష్, మండల కార్యదర్శి సచిన్ జైశ్వాల్, కోశాధికారి మధూకర్, మహేందర్‌గౌడ్, సంతోష్, ముంజల వెంకన్నగౌడ్, చౌదరి సాయి తదితరులు పాల్గొన్నారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీవో 49ని వెంటనే ఉప సంహరించుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధురాజ్, పార్టీ మండల అధ్యక్షుడు మేస్రాం జ్ఞానేశ్వర్ కోరారు. ఈ మేరకు తహసీల్దార్ 49 జీవోను రద్దు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. కార్యక్రవుంంలో పార్టీ జిల్లా కౌన్సిలర్ గోపాల్, నాయకులు దిలీప్‌కుమార్, నగేష్, నిర్దూడె జనార్దన్, సంతోష్, అంకుష్, జంగు, రమేష్ పాల్గొన్నారు.
పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటిస్తూ విడుదల చేసిన జీవో 49ను ఉపసంహరించుకోవాలని తహసీల్దార్‌కు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. అనంతరం జీవో 49 ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజేష్, సంతోష్, కాంతారావు, నాగేష్, రాజన్న, వైకుంఠం, భాస్కర్, నానయ్య, రవి, కిషన్, తుకారాం, ప్రభాకర్, శ్రీను, ప్రభాకర్, వెంకన్నలు పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం జీవో 49ని వెంటనే ఉపసంహరించుకోవాలని మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భగా జీవో ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు దిగంబర్, వసీఖాన్, తిరుపతి, రాజారాం, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్(టి), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో జీవో 49ని ఉపసంహరించుకోవాలని బీజేపీ నాయకుల వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు లావణ్య, మహేష్, ఎన్.లావణ్య, అశోక్, నాని, కుమారస్వామి, గురుదాస్, మహేష్, శేఖర్, మారుతి, నాగేందర్, బాలాజీ, విలాస్ తదితరులు పాల్గొన్నారు.