kumaram bheem asifabad- v
ABN , Publish Date - Jul 05 , 2025 | 10:58 PM
జీవో 49ని వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆదివాసీ భవనంలో శనివారం జీవో 49ని రద్దు చేయాలని ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొని ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.
ఆసిఫాబాద్, జూలై 5(ఆంధ్రజ్యోతి): జీవో 49ని వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆదివాసీ భవనంలో శనివారం జీవో 49ని రద్దు చేయాలని ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొని ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఆదివారం నుంచి ఈ నెల 13 వరకు ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పించనున్నామని చెప్పారు. 14న ప్రతి మండల కేంద్రంలోని తహసీల్దార్, ఎఫ్‌ఆర్వో కార్యాలయాల ఎదుట తీర్మాన ప్రతులు అందజేస్తామని తెలిపారు. 21న ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో, జిల్లా కేంద్రంలో సంపూర్ణ బంద్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. 28న ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళికలను రూపొందించామని తెలిపారు. సమావేశంలో నాయకులు కోట్నాక విజయ్‌కుమార్, మడావి శ్రీనివాస్, కోవ విజయ్, సుధాకర్, ప్రభాకర్ పాల్గొన్నారు.