Jayesh Ranjan: జయేశ్ రంజన్‌కు హైదరాబాద్ అభివృద్ధి బాధ్యతలు
ABN , Publish Date - Dec 26 , 2025 | 05:31 AM
శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో అతిపెద్ద నగరంగా మారిన గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారిని నియమించింది. రాష్ట్ర మెట్రోపాలిటన్, పట్టణాభివృద్ధి (ఎంఏయూడీ) శాఖలో ప్రత్యేకంగా..
హైదరాబాద్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో అతిపెద్ద నగరంగా మారిన గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారిని నియమించింది. రాష్ట్ర మెట్రోపాలిటన్, పట్టణాభివృద్ధి (ఎంఏయూడీ) శాఖలో ప్రత్యేకంగా.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ పరిధికి సంబంధించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు గురువారం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం యువజన, క్రీడలు, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన నిర్వహిస్తున్న అదనపు బాధ్యతలు కొనసాగుతాయని తెలిపింది. ఇక ఇప్పటివరకు జయేశ్ రంజన్ నిర్వర్తించిన పరిశ్రమలు, పెట్టుబడుల శాఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతల (ఎఫ్‌ఏసీ) కింద అప్పగించింది. ఆయనతోపాటు గురువారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24 మంది ఐఏఎ్‌సలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో ఏర్పడిన మహానగరాన్ని 12 జోన్లుగా విభజించిన నేపథ్యంలో.. బోర్ఖడే హేమంత్ సహదేవరావు (శేరిలింగంపల్లి), అపూర్వ్ చౌహాన్ (కూకట్‌పల్లి), సందీ్‌పకుమార్ ఝా (కుత్బుల్లాపూర్), ఎస్.శ్రీనివా్‌సరెడ్డి (చార్మినార్), జి.ముకుందరెడ్డి (గోల్కొండ), ప్రియాంకా ఆల (ఖైరతాబాద్), అనురాగ్ జయంతి (రాజేంద్రనగర్), ఎన్.రవికిరణ్ (సికింద్రాబాద్), కె.చంద్రకళ (శంషాబాద్), హేమంత కేశవ్ పాటిల్ (ఎల్బీనగర్), సంచిత్ గాంగ్వార్ (మల్కాజిగిరి), రాధికా గుప్తా (ఉప్పల్)లను జోనల్ కమిషనర్లుగా నియమించింది.
బదిలీ అయిన ఐఏఎ్‌సల వివరాలివే..
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఎం.హరితను టీజీపీఎస్సీ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఈ జిల్లాఅదనపు కలెక్టర్‌గా ఉన్న గరిమా అగర్వాల్‌కు కలెక్టర్‌గా తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు.
ఐటీ, సమాచార ప్రసారశాఖ డిప్యూటీ కార్యదర్శిగా ఉన్న భవేశ్ మిశ్రాను పరిశ్రమలు, పెట్టుబడులు, స్పీడ్ విభాగం అదనపు సీఈవోగా బదిలీ చేశారు.
మూసీ నది అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌డీసీఎల్) ఎండీగా ఈవీ నర్సింహారెడ్డిని నియమించారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌ను నారాయణపేట్ అదనపు కలెక్టర్‌గా బదిలీ చేశారు.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యదర్శి నిర్మల కాంతి వెస్లీని రాష్ట్ర ఉపాధి, శిక్షణ వ్యవహారాల శాఖ డైరెక్టర్‌గా నియమించారు.
మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉన్న ఐఎ్‌ఫఎస్ అధికారి షఫీయుల్లాను రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లకు ఎండీగా బదిలీ చేశారు.
హైదరాబాద్ జిల్లాకు సంబంధించి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా జి.జితేందర్‌రెడ్డిని, మరో అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పి.కధిరావన్‌ను నియమించారు.
ఎస్సీ సహకార అభివృద్ధి కార్పొరేషన్ జనరల్ మేనేజర్‌గా ఉన్న డి.హన్మంతునాయక్‌కు అదే విభాగం వీసీ, ఎండీగా బదిలీ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డిని టీజీఐఐసీ ఈడీగా బదిలీ చేశారు.
వికారాబాద్ అదనపు కలెక్టర్‌గా ఉన్న జి.లింగ్యానాయక్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా బదిలీ చేశారు.