kumaram bheem asifabad- జయశంకర్ ఆశయాలను కొనసాగించాలి
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:29 PM
తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో తెలంగాణ సాధనకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఆసిఫాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో తెలంగాణ సాధనకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సహాయ కర్తగా విశేష సేవలందించారని తెలంగాణ భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని దారపోసిన మహనీయుడన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం ఆధ్వర్యంలో జయశంకర్ జయంతిని జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీ శ్యాంనాయక్ తన కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సైతం జయశంకర్ జయంతిని జరుపుకున్నారు. విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీపీవో భిక్షపతిగౌడ్, బీసీ సంక్షేమాధికారి సజీవన్, డీటీవో రాంచందర్, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
వాంకిడి, (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయం, ఎంపీడీవో తహసీ ల్, తదితర కార్యాలయాల్లో ప్రొపెసర్ జయశంకర్ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ జడ్పీటీసీ అజయ్‌కుమార్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, తహసీల్దార్ కవిత, డీటీ రాంలాల్, ఈజీఎస్ ఏపీవో శ్రావణ్, శాఖ గ్రంథాలయ ఇంచార్జీ అశోక్, మాజీ సర్పంచు బండె తుకారాం, బీఆర్‌ఎస్ నాయకులు రాకేష్, అశుతోష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమ సారది, ప్రొఫెసర్ జయశంకర్ అడుగుజాడల్లో నడవాలని తహసీల్దార్ రామ్మోహన్ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ బీమ్లానాయక్, జూనియర్ అసిస్టెంట్లు సాయి, ప్రకాష్, జావీద్, గిరిజన నాయకుడు తిరుపతి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
సిర్పూర్ (టి) (ఆంధ్రజ్యోతి): ిమండలం కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బుధవారం ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ మహ్మద్ రహీముద్దీన్, ఎంపీడీవో సత్యనారాయణ, గ్రామ పంచాయతీ ఈవో తిరుపతి తదితరులు పాల్గొన్నారు.