జాతరొస్తోంది..
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:43 PM
గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణ తేదీలు ఖరారయ్యాయి. మే డారం కోయ పూజారులు నిర్ణయించిన విధం గా జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రో జుల పాటు జాతర జరుగనుంది.
సమ్మక్క జాతర నిర్వహణకు ఖరారైన తేదీలు
-జనవరిలో కొలువుదీరనున్న వనదేవతలు
-కమిటీలు వేయడంలో అధికారుల జాప్యం
-ఆచారాలనూ పాటించాలంటున్న భక్తులు
ఇల్లారీల కోసం స్థలం కేటాయించాలంటున్న భక్తులు
మంచిర్యాల, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణ తేదీలు ఖరారయ్యాయి. మే డారం కోయ పూజారులు నిర్ణయించిన విధం గా జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రో జుల పాటు జాతర జరుగనుంది. జనవరి 28న సాయంత్రం 6 గంటలకు సారలమ్మ, గోవింద రాజు, పగిడిద్ద రాజులు గద్దెలపైకి చేరనుండ గా, 29న సాయంత్రం 6 గంటలకు సమ్మక్క రానున్నారు. 30న అమ్మవార్లకు భక్తులు మొ క్కులు సమర్పించనుండగా, 31న దేవతలు వన ప్రవేశం చేయనున్నాయి.
జిల్లాలో పలు చోట్ల జాతర నిర్వహణ..
సమ్మక్క-సారలమ్మ జాతరను జిల్లా వ్యాప్తం గా పలు చోట్ల నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రం లోని గోదావరి నది ఒడ్డున దేవాదాయశాఖ ఆధ్వ ర్యంలో అధికారికంగా జాతర నిర్వహిస్తుండగా, మిగతా ప్రాంతాల్లో కమిటీలు వేసుకొని జాతరను నిర్వహి స్తారు. సింగరేణి ప్రాంతాలైన శ్రీరాంపూర్, మంద మర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో సంస్థ ఆధ్వర్యంలో జా తర ప్రతియేటా జరుగుతుంది.
మంచిర్యాలలో జరిగే జాతరకు దాదాపు ఐదు ల క్షల మంది భక్తులు హాజరవుతున్నారని నిర్వాహకు లు భావిస్తున్నారు. మంచిర్యాల వద్ద జాతర సమ యంలో జిల్లా నుంచే గాక చుట్టు పక్కల జిల్లా లతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ ప్రాంతాల నుం చి కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరవు తుం టారు. దూర ప్రాంతాలకు చెందిన ప్రజలు కుటుం బ సభ్యులతో కలిసి మూడు రోజుల పాటు గోదావరి నది పరిసరాల్లో బస చేస్తుంటారు.
ప్రత్యేక కమిటీలకు మోక్షం లభిస్తుందా..?
దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిబంధనల ప్రకా రం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేక కమి టీని నియమించాల్సి ఉంది. మూడేళ్ల క్రితం జాతర నిర్వహణ కోసం ప్రత్యేక ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయాలని హైదారాబాద్‌లోని ఎండోమెంటు డిపా ర్టుమెంట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ అసిస్టెంట్ కమిషనర్ 12-12-2022న మంచిర్యాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు ఆర్సీ నెంబర్ ఈ /5013/2022 లేఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రెండు నెలలు సమయం ఉన్నా జాతర ముగి సే వరకు అప్పుడు కమిటీ వేయలేదు. కమిటీ నియా మకానికి సంబంధించి ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుద ల చేసి, కాపీని జాతర వద్ద, తహసీల్దార్ కార్యాలయం, గ్రామ పంచాయతీ ఆఫీస్, మున్సిపల్ ఆఫీసుల్లో నోటీసు బోర్డులపై అతికించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాలను స్థానిక అధికారులు బుట్టదాఖలు చేయ డంతో కమిటీ నియామకం ఇప్పటికీ నోచుకోలేదు. మంచిర్యాల నగరంలోని సమ్మక్క-సారలమ్మ జాతర తోపాటు స్థానిక గోదావరి ఒడ్డున గల శ్రీ గౌత మేశ్వర స్వామి ఆలయం, జైపూర్ మండలం వేలాల గ్రామంలోని గట్టు మల్లన్న స్వామి ఆలయం, మల్లన్న ఆలయం, జన్నారం మండలంలోని చింతగూడ లక్ష్మీ దేవి ఆలయం, చెన్నూరులోని శ్రీ మదన పోచమ్మ ఆ లయం, బెల్లంపల్లిలోని శ్రీ కోదండరామాలయం, శ్రీ బుగ్గ రాజేశ్వరస్వామి ఆలయం, శ్రీరాంపూర్‌లోని శ్రీ గణపతి షి రిడీసాయి బాబా ఆలయానికి కమిటీల నియామకం జ రపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఉత్తర్వులు జారీ అ యి మూడేళ్లు పూర్తయినా జిల్లాలో ఎక్కడ కూడా కమి టీలు వేసిన పాపాన అధికారులు పోలేదు.
ఆచారాలకు విరుద్దంగా...
సమ్మక్క-సారలమ్మ జాతరను మేడారంలోని కోయ పూ జారుల నిర్ణయం మేరకు ఆచార వ్యవహారాలు నిర్వ హిం చవలసి ఉంటుంది. అయితే నిర్వహణ కమిటీలేని కార ణంగా 2023 జాతరలో కోయ పూజారుల సూచనల కు విరుద్దంగా నిర్వాహకులు వ్యవహరించడం వివాదాస్పద మైంది. జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయం ఆచార వ్య వహారాలను సమ్మక్క-సారలమ్మ జాతరలో అమలు చేయ డంతో విశిష్టతకు భంగం వాటిళ్లినట్లు అప్పట్లో తీవ్ర మైన ఆరోపణలు వచ్చాయి.
జాతరకు ఎన్నడూ లేని విధంగా రాజకీయ రంగు పు లుముతుండటంతో భక్తులు అవాక్క వ్వాల్సిన పరిస్థితు లు నెలకొన్నాయి. ఆజాతర సమయంలో తాత్కాలిక నిర్వ హణ కమిటీ సభ్యులు ఏకంగా అమ్మవార్ల గద్దెలను నా యకుల సన్మానాలకు వేదికగా మార్చడం వివాదాలకు దా రి తీసింది. జాతర జరిగిన నాలుగు రోజుల పాటు ప్రతి దినం రాజకీయ నాయకులకు, అధికారులకు గద్దెలపై స న్మానాలు చేయడం, ఫొటోలు దిగడంపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కేవలం నిర్వహణ కమిటీ లేకపోవడంతోనే జాతరలో నాయకులు, అధికారులు ఇష్ట మొచ్చినట్లు ప్రవర్తించారన్న ఆరోపణలు వినిపించాయి. ఇవ్వన్నీ ఎండోమెంటు ఉన్న తాధికారుల దృష్టికి వెళ్లడంతో నిర్వహణ కమిటీలు వేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి.
రోడ్డు మధ్యలో ఇల్లారీలు...
జాతరకు ముందు అమ్మవార్లను ఇల్లారీల్లో ఉంచడం కోయ సాంప్రదాయం ప్రకారం వస్తున్న ఆనవాయితీ. మంచిర్యాల జాతర వద్ద కూడా ఇల్లారీలు ఏర్పాటు చే శారు. ఇల్లారీలు ఏర్పాటు చేసిన స్థలం వద్ద నుంచి మా తా శిశు సంరక్షణ కేంద్రానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మిం చా రు. ప్రస్తుతం రోడ్డు మధ్యలో ఇల్లారీలు ఉన్నాయి. ఇ ల్లారీల వద్ద జాతర జరిగే మూడు రోజుల పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. రోడ్డు మధ్యలో ఉన్నందున ప్రత్యేక ఏ ర్పాట్ల కారణంగా ఆస్పత్రికి రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అధికారులు స్పందించి ఇ ల్లారీల కోసం మరో స్థలం కేటాయించాలనే విన్నపాలు సైతం వినిపిస్తున్నాయి.