నీటి సంరక్షణ కోసమే జల్‌సంచాయ్-జన్‌భగీరథి
ABN , Publish Date - Jun 03 , 2025 | 11:40 PM
జల సంవత్సరం కార ్య క్రమాన్ని ప్రాధాన్యత మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జల సంచాయ్-జల్‌భగీరథి కార్యక్రమం నిర్వహి స్తున్నామని జల్‌శక్తి శాఖ మంత్రి పీఆర్ పాటిల్ పేర్కొన్నారు. మంగళవారం న్యూఢిల్లీ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
-జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్
మంచిర్యాలకలెక్టరేట్,జూన్3(ఆంధ్రజ్యోతి): జల సంవత్సరం కార ్య క్రమాన్ని ప్రాధాన్యత మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జల సంచాయ్-జల్‌భగీరథి కార్యక్రమం నిర్వహి స్తున్నామని జల్‌శక్తి శాఖ మంత్రి పీఆర్ పాటిల్ పేర్కొన్నారు. మంగళవారం న్యూఢిల్లీ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసం దర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో జల సంరక్షణ జాతీయ ప్రాధాన్యతగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్ర మం ప్రవేశపెట్టిందన్నారు. వర్షపు నీటి సంరక్షణగా నిర్మాణాలు, నీటి నిర్వహణలో సమాజ పాత్ర ముఖ్యమన్నారు. ప్రజలంతా నీటిని స్వ చ్చందగా నీటిని పొదుపు చేసే విధంగా అవగాహన కల్పించాల న్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నీటి వనరుల విలువ, సురక్షిత త్రాగునీటి వినియోగం ద్వారా వ్యాధులను వ్యాప్తిని అరికట్టడంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. అనంతరం జిల్లా కలె క్టర్ మాట్లాడుతూ తాగునీటి వనరుల రక్షణపై ప్రత్యేక చర్యలు చేప ట్టాలన్నారు. ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించుకొని నీటిని కా పాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధి కారులు పాల్గొన్నారు.
వ్యాధుల నివారణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలి
వర్షాకాలం సమీపిస్తున్నందున జిల్లాలో కీటకజనిత వ్యాధులు ప్రబలకుండ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో కలిసి గూగుల్‌మీట్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కీటక జనిత వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటిస్తూ రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలని అన్నారు. జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక జ్వరం వార్డులు ఏర్పాటు చే యాలన్నారు. అవుట్‌డేటెడ్ మందులను వాడకూడదన్నారు. వరా ్షకా లంలో వ్యాధులు ప్రబలకుండా మున్సిపాలిటీలు ప్రజలకు తెలిపే వి ధంగా డప్పు చాటింపు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీహెచ్‌వో హరీశ్‌రాజ్, పంచాయతీరాజ్ మున్సిపల్ సంక్షేమం వెను కబడిన తరగతి అభివృద్ధి, షెడ్యూల్డకులముల అభివృద్ధి, డీఆర్ డీఏ, విద్య, వైద్య, శాఖల ఽఅధికారులు పాల్గొన్నారు.