Jai Shri Ram Bricks: భద్రాద్రిలో జై శ్రీరామ్ ఇటుకలు
ABN , Publish Date - Nov 12 , 2025 | 03:15 AM
దక్షిణ అయోధ్య భద్రాచలంలో జై శ్రీరామ్ నామం అచ్చు కలిగిన ఇటుకల తయారీకి అధికారులు ఏర్పాట్లు చేశారు...
భక్తుల చేతుల మీదుగా తయారీకి చర్యలు
భద్రాచలం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): దక్షిణ అయోధ్య భద్రాచలంలో ‘జై శ్రీరామ్’ నామం అచ్చు కలిగిన ఇటుకల తయారీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం బెంగళూరు నుంచి ప్రత్యేకంగా మోల్డ్‌లను తెప్పించారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం ఆ మోల్డ్‌లను పరిశీలించి నమూనా ఇటుకలను భక్తులతో తయారు చేయించారు. శ్రీరాముడి దర్శనానికి వచ్చే భక్తుల్లో ఆసక్తి కలిగిన వారితో, ఇటుకలను కొనుగోలు చేసే భక్తులతో ఈ ఇటుకలను తయారు చేయించేలా కార్యాచరణ రూపొందించడంపై దేవస్థానం ఈవో దామోదర్‌రావుతో చర్చించారు.