TPCC Working President Jaggareddy: 9 ఏళ్లు ఈ దేశ ప్రజల స్వాతంత్య్రం కోసం నెహ్రూ జైలు జీవితం గడిపారు
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:47 AM
ఈ దేశ ప్రజల స్వాతంత్య్రం కోసం 9 సంవత్సరాలు అంటే 3,259 రోజులు జైలు జీవితం గడిపిన చరిత్ర పండిట్ జవహర్ లాల్ నెహ్రూదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గుర్తు చేశారు...
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 136వ జయంతి సందర్భంగా సంగారెడ్డి రామ్‌నగర్ లోని జగ్గారెడ్డి ఇంటి వద్ద ఘనంగా బాలల దినోత్సవం
బిహార్ ఎన్నికల్లో ప్రజలు ఓటేశారా..? మిషన్లు ఓటేశాయా? అర్థం కావట్లేదు
రాహుల్‌కు ఒకటే చెప్పదలుచుకున్న
బిహార్ పోతే పోయింది.. మీరు ప్రధాని కావాల్సిన అవసరం ఉంది
ఈ దేశ ప్రజలు క్షేమంగా ఉండాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారె డ్డి
సంగారెడ్డి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఈ దేశ ప్రజల స్వాతంత్య్రం కోసం 9 సంవత్సరాలు అంటే 3,259 రోజులు జైలు జీవితం గడిపిన చరిత్ర పండిట్ జవహర్ లాల్ నెహ్రూదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గుర్తు చేశారు. నెహ్రూ 136వ జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని రామ్‌నగర్ లోని తన ఇంటి వద్ద జగ్గారెడ్డి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల త్యాగాల చరిత్రను కళ్లకు కట్టినట్లు ప్రదర్శనలు చేయించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఈ దేశ ప్రజలు సంక్షేమంగా ఉండాలంటే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. నెహ్రూ కుటుంబ త్యాగాల చరిత్ర తెలియక కొందరు రాజకీయ మూర్ఖులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం బాధాకరంగా ఉందని చెప్పారు. బిహార్‌లో ఓట్లేసిన వాళ్లు మనుషులా.. లేక మిషన్లా తెలియడం లేదని సందేహం వ్యక్తం చేశారు. బిహార్ పోతే పోయిందని, రాహుల్ గాంధీ మాత్రం ఈ దేశానికి ప్రధాని కావాలని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. త్యాగం.. పాలన.. మరణం.. అనేలా నెహ్రూ కుటుంబ చరిత్ర ఉందని తెలిపారు. దేశం కోసం తమ ఆస్తులతోపాటు ప్రాణాలను కూడా తాగ్యం చేశారని కొనియాడారు. జగ్గారెడ్డి ప్రత్యేకంగా నిర్వహించిన నెహ్రూ జయంతికి భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల, జగ్గారెడ్డి తనయుడు భరత్ సాయిరెడ్డి పాల్గొన్నారు.