ఎరుకల కులస్తులపై ఐటీడీఏ చిన్నచూపు
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:46 PM
ఆదివాసీలమైన తమ ఎరుకుల కులస్తులను గిరిజన అభివృద్ధి సంస్థ పూర్తిగా పట్టించుకోవడం లేదని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు దుగ్యాల బాపు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం చిన్నచూపు చూస్తుందన్నారు.
జిల్లా అధ్యక్షుడు దుగ్యాల బాపు
నెన్నెల, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీలమైన తమ ఎరుకుల కులస్తులను గిరిజన అభివృద్ధి సంస్థ పూర్తిగా పట్టించుకోవడం లేదని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు దుగ్యాల బాపు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం చిన్నచూపు చూస్తుందన్నారు. మం డల కేంద్రంలో గురువారం జిల్లా సరసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక తమ కులస్తులు దుర్బర జీవితాలు గడుపుతున్నారని అ న్నారు. పందుల పెంపకపై ఆధారపడి జీవించే తమకు ఎంపవర్మెంట్ స్కీం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పందుల పెంపకంతో పాటు తట్టలు, బుట్టలు, పొనకలు అల్లుకునే వారికి బ్యాంకుతో సంబంధం లేకుం డా ఐటీడీఏ తరపున రూ. 10 లక్షలు రుణం ఇవ్వాలన్నారు. ప్రతి గ్రామ శివారులో పందుల పెంపకం కోసం ఐదెకరాల ప్రభుత్వ భూమి కేటా యించాలన్నారు. జిల్లా కేంద్రం, ప్రధాన పట్టణాల్లో ఏకలవ్య ఆత్మగౌరవ భవనాలు, నాన్యమైన విద్య కోసం ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఏర్పాటు చే యాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పోడు భూములకు పట్టాలు, వ డ్డీలేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం కు లస్తులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లోకిని రవి, జిల్లా ఉపాధ్యక్షులు పోషం, రాష్ట్ర సహాయ కార్యదర్శి రాము, నెన్నెల, బెల్లంపల్లి, నస్పూర్, జైపూర్, హాజీపూర్, కన్నెపల్లి మండల అధ్యక్షులు మహేందర్, శ్రీరాముల రమేష్, సంతోష్, ఎల్లయ్య, కుర్ర రాజేష్, ముత్తేష్, దుర్గమ్మ, మదునక్క, సువర్ణ పాల్గొన్నారు.