Share News

School Girl Pregnancy Case: ఆశ్రమ విద్యార్థినికి గర్భం ఘటనపై ఐటీడీఏ విచారణ

ABN , Publish Date - Dec 19 , 2025 | 04:18 AM

భద్రాద్రి జిల్లా పినపాక మండలంలోని ఓ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక గర్భం దాల్చిన ఘటనపై భద్రాచలం ఐటీడీఏ అధికారులు విచారణకు ఆదేశించారు....

School Girl Pregnancy Case: ఆశ్రమ విద్యార్థినికి గర్భం ఘటనపై ఐటీడీఏ విచారణ

  • బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు

పినపాక, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి జిల్లా పినపాక మండలంలోని ఓ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక గర్భం దాల్చిన ఘటనపై భద్రాచలం ఐటీడీఏ అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌, వార్డెన్ల పాత్రపై డిప్యూటీ డైరెక్టర్‌ ఆరా తీసినట్లు తెలుస్తోంది. బాధిత బాలిక బయటకు వెళ్లేందుకు అనుమతులిచ్చారా? ఇస్తే ఎన్నిసార్లు ఇచ్చారు? లాంటి వివరాలతో పాటు, పాఠశాల, వసతి గృహం వద్ద ఎవరైనా గోడలు దూకి వచ్చేందుకు అవకాశం ఉందా? అనే కోణంలోనూ విచారించి, పాఠశాల ఆవరణను పరిశీలించినట్లు తెలుస్తోంది. బాలిక తల్లి ఫిర్యాదుతో ఏడూళ్లబయ్యారం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటన వసతిగృహం బయటే జరిగిందని పేర్కొంటూ బాధితురాలి తల్లిదండ్రుల నుంచి వసతిగృహం అధికారులు పత్రాలు రాయించుకున్నారని తెలుస్తోంది. వారి తప్పు లేనప్పుడు ఈ పత్రాల ప్రస్తావన ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Dec 19 , 2025 | 04:18 AM