Share News

గాంధీ పేరు మార్చాలనుకోవడం సరికాదు

ABN , Publish Date - Dec 29 , 2025 | 12:44 AM

మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు మార్చాలనుకోవడం కేంద్ర ప్రభుత్వానికి సరికాదని కాం గ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద ఆదివారం నిరసన వ్యక్తం చేశారు.

గాంధీ పేరు మార్చాలనుకోవడం సరికాదు

మహత్మాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ నాయకుల నిరసన

ఆత్మకూరు(ఎం), డిసెంబరు28 (ఆంధ్రజ్యోతి): మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు మార్చాలనుకోవడం కేంద్ర ప్రభుత్వానికి సరికాదని కాం గ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాం తాల్లో లక్షలాది మంది నిరుపేద కుటుంబాలకు పనికల్పిస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర పథకంగా మార్చడానికి ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించా రు. కుట్రలో భాగంగానే ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించి జీరామ్‌జీ అని మార్చాడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాన్ని కాంగ్రెస్‌ ఖండిస్తుందన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జెండావిష్కరణ చేశారు. కార్యక్రమంలో మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.సిద్దులు, మాజీ జడ్పీటీసీ కె.నరేందర్‌, మాజీ సింగిల్‌విండో చైర్మన్‌ జె.శేఖర్‌రెడ్డి, సర్వేపల్లి సర్పంచ్‌ కె.ఉపేందర్‌రెడ్డి, మాజీ సర్పంచు లు జె.నాగేష్‌, ఎస్‌.వెంకటేశం, మాజీ ఎంపీటీసీలు డి.నర్సింహాచారి, కె.హనుమంతు, ఎం.వెంకటేశం, బి.ఉప్పలయ్య, పంజాల నర్సయ్య పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2025 | 12:44 AM