మహాత్మాగాంధీ పేరును తొలగించడం సిగ్గుచేటు
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:16 PM
జాతీయ ఉపాధి హా మీ పథకానికి మహాత్మాగాంధీ పేరు ను తొలగించడం సిగ్గు చేటని సీపీ ఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్.శ్రీ నివాసులు, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు మారేడు శివశంకర్ అన్నా రు.
- ఉపాధి పథకం పేరు మార్పుపై వామపక్షాల నిరసన
కందనూలు, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : జాతీయ ఉపాధి హా మీ పథకానికి మహాత్మాగాంధీ పేరు ను తొలగించడం సిగ్గు చేటని సీపీ ఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్.శ్రీ నివాసులు, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు మారేడు శివశంకర్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో జాతీయ ఉపాధి హామీ పథకం మహాత్మాగాంధీ పేరును తొలగిం చడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరే కంగా కార్యక్రమం చేపట్టారు. వారు మాట్లా డుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా 2005 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వంలో తీసుకొచ్చినట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ పథకం పేరు మార్చి వీబీ జీ రామ్ జీ పథకంగా పార్లమెంట్‌లో చ ట్టాన్ని తీసుకొచ్చి బిల్లు ఆమోదించిందని తెలిపా రు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యు లు సూర్యశంకర్‌గౌడ్, నాయకులు వెనేపల్లి ర వీందర్, కొత్త రామస్వామి, వాడాల బాలపీరు, సీపీఎం మండల కమిటీ సభ్యులు, నాగపూర్ మధు, వెంకటేశ్, మల్లికార్జున్ పాల్గొన్నారు.