Share News

అదను దాటుతోంది..

ABN , Publish Date - Aug 08 , 2025 | 11:43 PM

జిల్లాలో వర్షాభావ పరిస్థితులు రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. వరి నారుమడులు ముదిరి పోతున్నాయని, నాటేతలకు అదనుదాటి పో తోందని దిగులు చెందుతున్నారు. అడపదడప కురిసే చినుకులు ఆరుతడి పంటలకు జీవం పోస్తున్నా, వరి సాగు మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.

అదను దాటుతోంది..

-ముదిరిపోతున్న నారుమడులు

-వర్షాభావంతో వరినాట్లకు వెనుకడుగు

-సాగు లక్ష్యం 1.60 లక్షల ఎకరాలు.. 84 వేల ఎకరాల్లోనే నాట్లు పూర్తి

-జిల్లాలో సగటున -37 శాతం లోటు వర్షపాతం

-17 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు

-ప్రాజెక్టుల్లో అంతంత మాత్రంగా నీటి నిల్వలు... నిండని చెరువులు

-ఆందోళనలో రైతాంగం

నెన్నెల/హాజీపూర్‌ ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి)

జిల్లాలో వర్షాభావ పరిస్థితులు రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. వరి నారుమడులు ముదిరి పోతున్నాయని, నాటేతలకు అదనుదాటి పో తోందని దిగులు చెందుతున్నారు. అడపదడప కురిసే చినుకులు ఆరుతడి పంటలకు జీవం పోస్తున్నా, వరి సాగు మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టుల్లో అంతంత మాత్రంగా నీటి నిలువలు ఉండగా, చెరు వులు, కుంటలు నీరు లేక వెలవెల బోతున్నాయి. ఆగ స్టు 20 నాటికి వరినాట్లు పూర్తి కావాల్సి ఉండగా, జిల్లాలో 50 శాతం మాత్రమే నాటేతలయ్యాయి. జూన్‌ 1 నుంచి శుక్రవారం వరకు జిల్లా సాదారణ వర్షపా తం 557.4 శాతం కాగా 353.5 శాతం మాత్రమే న మోదైంది. ఇది సాధారణం కంటే-37 శాతం తక్కువ అని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని భీమిని మం డలం తప్ప మిగతా 17 మండలాల్లో వర్షాభావ పరి స్థితులు నెలకొన్నాయి.

-ముదిరిపోతున్న నారుమడులు

జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఇప్పటికి 84,245 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేసుకున్నారు. బో రు నీటి సౌకర్యం ఉన్నవారు, ప్రధాన కాలువలకు ద గ్గెర ఉన్న రైతులు మాత్రమే నాట్లు వేసుకోగా, మిగతా రైతులు నాట్లు వేసేందుకు ధైర్యం చేయడం లేదు. ఫలితంగా వందల ఎకరాల ఆయకట్టు పొలాలు బీళ్లు గా దర్శనం ఇస్తున్నాయి. కొందరి నారుమడులు ఎండి పోగా, మిగతావా రివి ముదిరిపోతున్నాయి. భీమిని, తాండూరు, కాసిపేట మండలాల్లో ఇప్పటికి వరినాట్లు 200 ఎకరాలు కూడా దాటలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సాధార ణంగా 20 రోజుల నుంచి నెల రోజుల వయసు గల లేత నారు వేసుకుంటే ఆశించిన దిగుబడులు వస్తా యి. ముందుగా విత్తనాలు వేసుకున్న రైతుల నారు వ యసు నెలన్నర దాటి ముదిరిపోయింది. ఆ నారు వేసు కుంటే పిలుకలు రావని.. వేల రూపాయలు ఖర్చు చేసి ముదురు నారు వేసిన ప్రయోజనం ఉండదని రైతు లంటున్నారు. వర్షం పడకపోతుందా అనే దింపుడు క ళ్లం ఆశతో కొందరు రైతులు మరోసారి విత్తనాలు చ ల్లుకుంటున్నారు. మరికొందరు ప్రత్యామ్నాయ పంటలు వేయాలనే ఆలోచనలో ఉన్నారు.

-నిండని చెరువులు.. కుంటలు

వేసవి ఎండలకు ఎండిన చెరువుల్లో ఇంతవరకు నీ రు చేర లేదు. ప్రాజెక్టుల్లో సైతం ఆశించిన స్థాయి నీటి నిల్వలు రాలేదు. భారి వర్షాలు కురిసి వరదలు పారితే తప్ప కుంటలు, చెరువులు, ప్రాజెక్టులకు నీరు చేరదు. రెండు నెలల వానాకాలంలో భారి వర్షాలు లేక పోవడం తో జలాశయాలు వెలవెలబోతున్నాయి. ప్రతి సీజన్‌లో ఈ సమయానికి చెరువులు నిండి మత్తళ్లు దూకేవి. కా లువల నిండా నీళ్లు పారేవి. కాని ప్రస్తు తం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కొన్ని చెరు వుల్లో తూములకే నీరందని దుస్థితి ఉంది. ఇతర పం టల్లా కాకుండా వరిలో నారు పోసిన నాటి నుంచి గింజకట్టి గట్టిపడే వరకు ప్రతి నిత్యం నీటి తడులు అవసరం అవుతాయి. ప్రస్తుతం జలాశయాల్లోని నీటి నిల్వలు ఆఖరు వరకు నిరందించే పరిస్థితిలో లేవు. దీంతో చెరువులు, ప్రాజెక్టుల ఆయకట్టు రైతులే వరి సాగుపై సందిగ్ధంలో ఉండగా, ఆకసాయి రైతులు పూర్తిగా ఆశలు వదులుకున్నారు.

-ప్రత్యామ్నాయం వైపు..

ధైర్యం చేసి వరినాట్లు వేద్దామన్నా రైతులను ఖ ర్చులు భయపెడుతున్నాయి. నాటేసినాక సాగు నీరం దకపోతే పెట్టుబడులు మునుగుతామని వెనుకడుగు వేస్తున్నారు. ట్రాక్టర్‌తో దమ్ము కొట్టేందుకు ఎకరానికి రూ. 6 వేల నుంచి 7 వేల వరకు వసూలు చేస్తున్నా రు. నాటు వేసే కూలీలు రూ. 5 వేలు తీసుకుంటు న్నారు. దుక్కిలో వేసే డీఏపీ, సూపర్‌ లాంటి ఎరువు లు, ఇతర కూలీలకు మరో రూ. 3వేల వరకు వ్య యం అవుతోంది. ఇవన్ని ఖర్చులు పెట్టి నాట్లు వేస్తే పంట పండటం దేవుడెరుగు పెట్టుబడి నష్టపోతామని రైతులంటున్నారు. మరో వారం పది రోజులు వేచిచూ సి ప్రత్యమ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవడం మంచిదనే ఆలోచనలు రైతులున్నారు.

నారుమడి ఎండిపోతోంది

-ఓరగంటి బాపు, నెన్నెల

కుమ్మరివాగు ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టులో నాకు మూడు ఎకరాల పొలం ఉంది. ప్రాజెక్టు తూ ముకే నీరు అందడం లేదు. కాలువలో నీటి బొట్టు రా వడం లేదు. నారు మడి తయారు చేసుకొని 40 రోజు లు అవుతోంది. వర్షాలు లేక నారంతా ఎర్రబారి ఎండి పోతోంది. సాగునీరు ఉంటే నాట్లు పూర్తి చేసు కునే వాల్లం. ఇప్పటికి పొలం పచ్చబడేది. కలుపు తీసే వాల్లం. వాతావరణ పరిస్థితి చూస్తే ఈ ఏడు వరి నాట్లు వేసే పరిస్థితి లేదు.

-జిల్లాలో ఇప్పటి వరకు సాగైన పంటలు

వరి 84245 ఎకరాలు

పత్తి 157649 ఎకరాలు

మక్క 140 ఎకరాలు

కంది 641 ఎకరాలు

పెసర 453 ఎకరాలు

మినుములు 22 ఎకరాలు

ఎన్నడు లేని విధంగా తీవ్ర వర్షభావం....

ముత్యాల శంకరయ్య, రైతు హాజీపూర్‌ మండలం నంనూరు గ్రామం

పదేళ్ల కాలంగా ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటి కీ చెరువులు కుంటలు నిండలేదు. నారు పోసుకొని నాటు వేసేందుకు సిద్ధంగా ఉండగా వర్షాలు లేక పొలం మడులలో నీరు నిలవడం లేదు.

Updated Date - Aug 08 , 2025 | 11:43 PM